|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు తల్లిగా జన్మలో ఒప్పుకోనన్న సుమిత్ర- పారిజాతంకు పోయిన గొంతు- దీపకు పెద్ద షాక్

Published: 08-08-2025, 11:10 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు తల్లిగా జన్మలో ఒప్పుకోనన్న సుమిత్ర- పారిజాతంకు పోయిన గొంతు- దీపకు పెద్ద షాక్

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్, దీపల జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. సుమిత్ర దీపను తన కుమార్తెగా అంగీకరించడానికి నిరాకరిస్తుంది, పారిజాతం గొంతు కోల్పోతుంది, దీపకు పెద్ద షాక్.!

Key Points

1

సుమిత్ర దీపకు తల్లిగా ఒప్పుకోవడానికి నిరాకరిస్తుంది.

2

పారిజాతం గొంతు కోల్పోతుంది.

4

దీప తన తల్లిదండ్రులకు శత్రువు అవుతుందని భావిస్తుంది.

సుమిత్ర నిర్ణయం

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు అమ్మ నాన్నల స్థానంలో సుమిత్ర, దశరథ్ గారు ఉండి పెళ్లి చేయాలని కార్తీక్ అనడంతో ఇంటిల్లిపాది అవాక్కవుతారు. నువ్ ఈ కోరిక కోరావంటే నీకు దీప అమ్మనాన్న తెలుసా. నేను ఎలా రియాక్ట్ అవ్వాలని జ్యోత్స్న అంటుంది. ఇంతపెద్ద షాక్ ఇచ్చావేంటీ బావ అని దీప అంటుంది.

పారుకు మాటలు రావు. తీర్చేవాళ్లు తీరుస్తారు అని కార్తీక్ అంటే.. ఏంట్రా తీర్చేది. దీప పక్కన నిలబడేందుకే ఇబ్బంది పడే నేను. తల్లిగా ఎలా ఒప్పుకుంటాను. అది ఎప్పటికీ జరగదు అని కోపంగా వెళ్లిపోతుంది సుమిత్ర. మీరేమంటారు పెద్దసారు అని శివ నారాయణను కార్తీక్ అడిగితే.. ఇప్పుడేగా చెప్పావ్. ఆలోచించుకోడానికి టైమ్ కావాలి అని శివ నారాయణ వెళ్లిపోతాడు.

వాళ్లకు టైమ్ కావాలట నువ్వెళ్లి వంట చేసుకో అని దీపను పంపిస్తాడు కార్తీక్. పారిజాతంకు మాటలు రావు, గొంతులో నుండి సౌండ్ రాకుండా గొంతు పోతుంది. పారును ఒక్కటి కొడుతున్నట్లు చేసి మాట వచ్చేలా చేస్తుంది జ్యోత్స్న. నాటకాల భాషతో పారు కార్తీక్ మాట్లాడిన దాని గురించి అంటుంది పారు. వాడు మేధావే. నువ్వే మట్టిబుర్రవి. నువ్ చేసిన ఘోరాలు, వాటిని నేను ఎన్ని తంటాలు పడ్డానో నాకు తెలుసు అని పారు గొడవ పడుతుంది.

పారిజాతం విషాదం

నీకు నాకు సంబంధం లేదు. నా గురించి పట్టించుకోకు అని జ్యోత్స్న అంటుంది. వెళ్లవే వెళ్లు. నీకు పెళ్లి గడియలు లేవని పంతులు గారు నిజం చెప్పారే. నీకు ఒక్కసారి కూడా పెళ్లి కావట్లేదు. దీపకు పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు అవుతున్నాయి అని పారిజాతం అంటుంది. తాత ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోడు. బావ అనుకున్నది జరగదు అని అని జ్యోత్స్న అరిచి మరి చెబుతుంది.

సమస్య దీప నుంచి మొదలైంది. పరిష్కారం అక్కడే ఉండొచ్చు అని పారిజాతం అంటుంది. మరోవైపు తేరుకునేలోపు ఊహించని మలుపు పెట్టావ్ ఏంటీ బావ. కానీ, ఈ పెళ్లి జరగదు. వాళ్లకు నా నుంచి జ్ఞాపకాలు ఉండేందుకే ఇలా చేస్తున్నావని నాకు తెలుసు. కానీ, ఇప్పుడు నేను మా అమ్మకు శత్రువు అని కార్తీక్‌తో దీప అంటుంది.

వాళ్లు ఒప్పుకోకుంటే మనం క్షమించం. జ్యోత్స్న చేసిన నేరానికి క్షమాభిక్ష లేదు. అత్త ఇచ్చిన మాట గోదారిలో కలిసినట్లే అని కార్తీక్ అంటాడు. తాత కూడా ఒప్పుకోడు తన మనవరాలి పెళ్లి చూడాలనుకున్నాడు. కానీ, నా మెడలో ఈ ఇంట్లో ఎలా తాళి కట్టనిస్తాడు. తాత టైమ్ అడిగిన అమ్మ ఒప్పుకోదు అని దీప అంటుంది. ఓ ప్రయత్నం చేశాను. జరగదని ఎందుకు అనుకోవాలి. బయట ఉంటాను. మంచి కాఫీ తీసుకురా అని కార్తీక్ అంటాడు.

దీప భవిష్యత్తు

మరోవైపు సుమిత్రను కార్తీక్ అడిగిన దాని గురించి అడుగుతాడు దశరథ్. ఇంతలో శివ నారాయణ వాడు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పలేం. వాడు అడగలేదు. మనమే అడిగాం. కానీ, వాడు అడిగింది నోట మాట రాలేదు. పారుకు అయితే గొంతు కూరుకుపోయింది. అందుకే టైమ్ అడిగాను అని శివ నారాయణ అంటాడు. ఎంత టైమ్ తీసుకున్న నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేను దీపకు తల్లిగా ఎప్పటికీ ఒప్పుకోను అని సుమిత్ర వెళ్లిపోతుంది.

సుమిత్రతో నేను మాట్లడతాను. కానీ, మీ నిర్ణయమే మా నిర్ణయం అని దశరథ్ కూడా వెళ్లిపోతాడు. నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదని శివ నారాయణ అనుకుంటాడు. మరోవైపు దీప వెళ్తుంటే పారు ఆపుతుంది. కార్తీక్ పెట్టిన కాఫీని పారిజాతం తీసుకుంటుంది. కానీ, అందులో మిర్యాలు ఉండటంతో ఊంచేస్తుంది పారు. పారిజాతానికి మాటకు మాట సమాధానం ఇస్తుంది దీప.

అదంతా చూసిన కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న కూడా వస్తుంది. దీని వెనుక దీపకున్న ఉద్దేశం ఏంటీ అని జ్యోత్స్న అడిగితే నేను అడిగేవరకు దీపకు కూడా తెలియదు అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక్ మరియు దీపల ప్రేమకు ఎదురవుతున్న అడ్డంకులు మరియు కుటుంబ సమస్యలతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. వారి ప్రేమ విజయవంతం అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.