
కార్తీక దీపం 2 సీరియల్ లో ఈ రోజు ఎపిసోడ్ లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. జ్యోత్స్న యొక్క మోసాలు బయటపడటంతో పాటు, దీప మరియు కార్తీక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరించాయి.
Key Points
పారిజాతం జ్యోత్స్నను లాగిపెట్టి కొట్టింది.
జ్యోత్స్న తన నిజమైన సంబంధాన్ని పారుతో పంచుకుంది.
కార్తీక్ పారిజాతంపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.
జ్యోత్స్నపై పారిజాతం దాడి
కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో జ్యోత్స్న కంగారుగా వెళ్లి తన గదిలో ఉంగరాల కోసం వెతుకుతుంది. కానీ అవి టెడ్డీ బేర్ లోపల కనిపించవు. నేను నా ఎంగేజ్మెంట్ చెడగొట్టాలనుకుంటున్నట్లు బావకు తెలిసిపోయింది అని జ్యో అనుకుంటుంది. అప్పుడే ఆవేశంగా వచ్చిన పారిజాతం జ్యోను లాగిపెట్టి కొడుతుంది. గ్రానీ అని జ్యో అరిస్తే.. అరిస్తే బీపీ పెరిగిపోతుంది, వరుస పెట్టి ఉతుకుతూనే ఉంటా అని పారు అంటుంది.
నన్ను ఎందుకు కొట్టావో చెప్పు అని జ్యో అడుగుతుంది. నువ్వు తప్పించుకోవడం కోసం పక్కోడు చచ్చినా పర్లేదా? అని పారు ఫైర్ అవుతుంది. చూస్తుంటే దీప , కార్తీక్ నన్ను బయటకు పంపించేలా ఉన్నారని జ్యో అంటుంది. నిన్నెందుకు పంపిస్తారు అని పారు అడిగితే.. నేను అసలైన వారసురాలిని కాదు కాబట్టి, ఈ విషయం వాళ్లకు తెలిసి ఉంటే అని జ్యో చెప్తుంది. ఇంత పెద్ద నిజం తెలిస్తే ఎందుకు సైలెంట్ గా ఉంటారు అని పారు అంటుంది.
ఆ నిజం తెలిస్తే బయటవాళ్లు బతికి ఉండరు అని పారు సీరియస్ గా అంటుంది. అప్పుడే జ్యో నిజం చెప్పేస్తుంది. కార్తీక్ మా మేన బావ, దీప మా మమ్మీ కూతురు అని జ్యోత్స్న అనగానే పారు షాక్ కు గురవుతుంది. ఏంటే దీప సుమిత్ర కూతురా అని పారు మళ్లీ అడుగుతుంది. కానీ అది అలాగే ఫీల్ అవుతుంది అని జ్యో కవర్ చేస్తుంది.
జ్యోత్స్న మరీ ఇలా మనసు లేని మనిషిలా ఎలా మారింది బావ అని దీప, కార్తీక్ మాట్లాడుకుంటారు. పాలు పోసి పెంచిన వాణ్నే పాము కాటేస్తుంది అన్నట్లు జ్యోత్స్న కూడా అలాంటిదే. ఎవరిని ఏం చేయడానికైనా వెనుకాడదు. జ్యోత్స్న రాకను గమనించి వెంటనే దీపతో రొమాంటిక్ గా మాట్లాడతాడు కార్తీక్. రోజా పువ్వు తెెంచి దీప జడలో పెడతాడు. మరీ ఎక్కువ పొగిడితే దిష్టి తగులుతుంది బావ అని దీప కార్తీక్ చెంపపై సుతారంగా కొడుతుంది. అబ్బనీ తీయని దెబ్బ అంటూ కార్తీక్ డ్యాన్స్ చేస్తాడు. అది చూసి జ్యోత్స్న మండిపోతుంది.
జ్యోత్స్న నిజం బయటపెట్టడం
రోజా ఎందుకు తెంపావని పారు అడిగితే.. కార్తీక్ సెటైరికల్ గా భారీ డైలాగ్ లు చెప్తాడు. ఈ ఆస్తి నాది కాదు నీది కాదు చివరకు ఈ పెద్ద మేడం ది కూడా కాదు అని అనగానే జ్యో కంగారు పడుతుంది. ఆస్తి చిన్న సారుది అని అంటాడు కార్తీక్. నన్ను ఇంటి యజమానిగా గుర్తించు అని పారు తల కొట్టుకుంటుంది. కానీ నువ్వు నా చెంపను తడితే వాతలు పెద్ద మేడం చెంపపై పడటం ఏంటీ అని కార్తీక్ దీపతో అంటాడు. కొట్టిన వాళ్లను నానా బూతులు తిడతాడు కార్తీక్. గాల్లో నరసింహతో మాట్లాడినట్లు నటించిన కార్తీక్ మళ్లీ తిట్లు అందుకుంటాడు. ఇవి తట్టుకోలేక పారు తానే కొట్టానని చెప్తుంది.
ఎప్పుడైనా పువ్వు పెట్టారా
ఇరికిస్తే ఊరుకుంటారా? అని పారు అనగానే అక్కడికి వచ్చిన శివన్నారాయణ గద్దించి అడుగుతాడు. జ్యోత్స్నను పారు లాగిపెట్టి కొట్టింది అని చెప్పేలోపే మధ్యలో పారు అడ్డుపడుతుంది. ఈ డ్రైవర్ మన తోటలో పువ్వు కోసి దీప తలలో పెట్టాడు అందుకే తిడుతున్నా అని మ్యాటర్ డైవర్ట్ చేస్తుంది పారు. మీరు ఎప్పుడైనా తలలో పువ్వు పెట్టారా అని అడుగుతుంది పారు. వెంటనే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అనుకుంటూ శివన్నారాయణ వెళ్లిపోతాడు. పారు, కార్తీక్ మాట్లాడుకుంటుండగా కార్తీక్ అంటూ దశరథ్ వస్తాడు.
ఏంటీ చిన్న సారు అని కార్తీక్ అంటే.. ఎవరూ లేనప్పుడైనా మామయ్య అని పిలువు. నీలో నా చెల్లెల్ని చూసుకుంటున్నా. మనం పోసిన ప్రాణం. నువ్వు నన్ను మామయ్య అని పిలిస్తే నా చెల్లి అన్నయ్య అని పిలిచినట్లు ఉంటుంది అని దశరథ్ అంటాడు. దూరంగా ఉన్నవాళ్లను దగ్గర చేసుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నువ్వయితే వీలైనప్పుడల్లా మామయ్య అని పిలువు అనగానే కార్తీక్ సరే మామయ్య అంటాడు. నీతో మాట్లాడాలి అని కార్తీక్ ను పిలుచుకుని వెళ్లిపోతాడు దశరథ్.
దీప మరియు కార్తీక్ రొమాన్స్
దాసు గురించి ఏమైనా తెలిసిందా? అని దశరథ్ అంటే త్వరలోనే వస్తాడు అని కార్తీక్ అంటాడు. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా? గౌతమ్ మంచివాడా కాదా? ఎవరినో ప్రేమ పేరుతో మోసం చేశాడని దీప అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చింది. అదే దీప గౌతమ్ ను మంచివాడు అని కూడా చెప్పింది. ఇందులో ఏది నిజం అని దశరథ్ అడుగుతాడు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. నా కూతురు అమాయికురాలు అనుకున్నా కానీ దాసును చంపాలని అనుకున్నప్పటి నుంచి చూస్తున్నా. ఇందులో తప్పు ఏంటో తెలియాలి. దాసు చెప్పాలి. ఇదంతా జ్యోత్స్న ఎందుకు చేస్తుందో తెలియాలి అని దశరథ్ అంటాడు.
కూతురు విషయంలో సుమిత్ర సెన్సిటివ్ అందుకే ఏ విషయం ఆమెకు తెలియనివ్వడం లేదు. జ్యోత్స్న జీవితం చెడిపోతే నేను బతికి ఉంటే లాభం ఏంటీ? నా చెల్లెలు లక్కీ బంగారం లాంటి కోడలు వచ్చింది అని దశరథ్ అంటాడు. దీప నీ కూతురే మామయ్య అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక పర్వతాన్ని ఎత్తుకుని దేవుడిలా నిలబడ్డా శ్రీకృష్ణుడి స్టోరీ చెప్తాడు కార్తీక్. మీ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు మామయ్య అని కార్తీక్ వెళ్లిపోతాడు.
రూమ్ లో ఉన్న సుమిత్రకు కాఫీ ఇస్తుంది దీప. నువ్వు అన్ని టైమింగ్ గుర్తు పెట్టుకుని చేస్తున్నావు. ఎప్పుడు ఏం తింటాను, ఎప్పుడు జ్యూస్ తాగుతాను అని ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుని అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏంటీ అని దీపను అడుగుతుంది. ఎందుకంటే నువ్వు నా కన్నతల్లివి అని మనసులో అనుకుంటుంది దీప. నీకు నా మీద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు అని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో జ్యోత్స్న యొక్క మోసపూరిత ప్రవర్తన మరియు కార్తీక్ యొక్క తీవ్రమైన ప్రతిస్పందన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథ ఎలా కొనసాగుతుందో చూడటానికి ఆసక్తికరంగా ఉంది.


