|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నేను నీ తండ్రిని.. దీపతో దశరథ్- కాంచన కోసం కావేరి త్యాగం- కార్తీక్‌ను ఏడిపించిన చిన్నమ్మ

Published: 20-08-2025, 11:13 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నేను నీ తండ్రిని.. దీపతో దశరథ్- కాంచన కోసం కావేరి త్యాగం- కార్తీక్‌ను ఏడిపించిన చిన్నమ్మ

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లి ఏర్పాట్ల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చిక్కులు, కావేరి త్యాగం, మరియు కార్తీక్‌ను ఏడిపించిన చిన్నమ్మ ప్రవర్తన చూడవచ్చు. శ్రీధర్ కుట్రలు కూడా కథను ఆసక్తికరంగా మారుస్తాయి.

Key Points

1

దీపతో దశరథ్ కలిసి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటారు.

2

కావేరి తన చెల్లి కాంచన కోసం తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది.

4

చిన్నమ్మ వల్ల కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

పెళ్లి ఏర్పాట్లు మరియు కుటుంబ సమస్యలు

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి ఎందుకు వచ్చారని శ్రీధర్‌ను అడుగుతుంది పారిజాతం. నేను ఒక్కన్నే కాదు ఫ్యామిలీ మొత్తం వచ్చామని కాంచన, అనసూయ, శ్రుతి వస్తుంటారు. వీళ్లంతా ఎందుకొచ్చారని పారు అంటే.. రేపే కదా పెళ్లి, సందడిగా ఉండాలని రప్పించాను అని కార్తీక్ అంటాడు.

మీ తాత చూస్తే తిడతాడురా అని పారు అంటే ఎందుకు తిడతాడు. నువ్వే రమ్మన్నవాని చెబుతాను అని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం తెగ భయపడిపోతుంది. ఇంతలో శివ నారాయణ వస్తే పక్కకు వెళ్లి దాక్కుంటుంది. వీళ్లను ఎవరు రమ్మన్నారని సుమిత్ర అడిగితే.. నేనే రమ్మన్నాను అని శివ నారాయణ అంటాడు. వీళ్లను పిలిచింది ముసలోడా. రేయ్ కార్తీక్ నువ్ ఖతర్నాక్‌రా అని పారు అంటాడు.

ఏమైనా చెప్పడానికి పిలిపించారా అని జ్యోత్స్న అంటే లేదు ఉండటానికి అని శివ నారాయణ అంటాడు. పద్ధతి ప్రకారం మొగ పెళ్లి వాళ్లను ఒకరోజు ముందుగా పిలిపించారు అని దశరథ్ అంటాడు. పని వాళ్ల పెళ్లికి ఇదంతా అవసరమా అని పారిజాతం అంటే.. మాట అంటే ఏంటో నీకు తెలియదు. నేను ఏది చేయను. చేస్తే పద్ధతి ప్రకారం చేస్తాను. సగం సగం మనసుతో చేయడం నాకు నచ్చదు అని శివ నారాయణ అంటాడు.

నాన్న అని కాంచన పిలిస్తే వీళ్లను బాగా చూసుకో అని దశరథ్‌కు చెప్పి వెళ్లిపోతాడు శివ నారాయణ. తనకు ఓ మాట చెప్పలేదని సుమిత్ర అలిగి వెళ్లిపోతుంది. నాకు మర్యాదలు తగ్గితే ఇక్కడి నుంచి వెళ్లిపోతా అని శ్రీధర్ అంటాడు. మీకు ఏం కావాలో చెప్పండి నేను చూసుకుంటా అని దీప అంటే.. అమ్మా నువ్ పెళ్లి కూతురివి. నా కూతురువి. నా వియ్యంకుడికి నేను మర్యాదలు చేస్తాను అని శ్రీధర్ అంటాడు.

కావేరి యొక్క త్యాగం మరియు కార్తీక్ భావోద్వేగం

అందరూ క్యారెక్టర్‌లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. సరేగానీ ముందు నాకు ఒక జ్యూస్ ఇప్పించండి అని శ్రీధర్ అంటే.. పారును చూసుకోమ్మని దశరథ్ చెప్పి వెళ్లిపోతాడు. బాగా ఓవర్ చేస్తున్నావ్ అని కార్తీక్ అంటే దొరక్కా దొరక్కా దొరికిన ఛాన్స్ ఇది. అందరిని ఒక ఆట ఆడుకుంటాను అని శ్రీధర్ వెళ్లిపోతాడు. ఇంకా రావాల్సిన వాళ్లు రాలేదనుకున్న కార్తీక్.. కావేరికి కాల్ చేస్తాడు.

నా వాళ్లు అంటే నువ్వుండవా. రా పెళ్లికి అని కార్తీక్ అంటే.. నేను రాలేను. అక్క కోసం. నాకు చెల్లి స్థానం, నా బిడ్డకు కూతురు స్థానం ఇచ్చింది. నేను పెళ్లికి రాకుంటేనే అక్కకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. నేను వస్తే అక్కకు అవమానంగా ఉంటుంది. అక్క కంటే నేను కోరుకున్న సంతోషం ఏముంటుంది అని కావేరి త్యాగం చేస్తుంది. నువ్ కూడా నన్ను ఏడిపిస్తావేంటీ చిన్నమ్మా అని కార్తీక్ అంటాడు.

సరే చెల్లినైనా పంపు అని కార్తీక్ అంటే.. తను వస్తే ఎలా చెల్లి అవుతుందని చెబుతావ్. తను రాకుంటే అసలు నా ప్రస్తావన రాదు కదా అని స్వప్న అంటుంది. దాంతో స్వప్న మాట్లాడుతుంది. కాశీని ఎక్కడికో పంపిచావంటా. ఎందుకిన్ని త్యాగాలు అని కార్తీక్ అంటాడు. రేపే పెళ్లి ముందు గ్లామర్‌గా ఉండు అని స్వప్న అంటుంది. మేము రావట్లేదని ఏం అనుకోకు అని కావేరి అంటుంది.

ఇంతమంది మంచోళ్లు మా నాన్నకు ఎలా బలి అయ్యారో అని కార్తీక్ అనుకుంటాడు. మరోవైపు అంతా సంతోషంగా నవ్వుతు మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్రకు నచ్చదు. వీళ్లంత నవ్వుతుంటే నా కడుపు మండిపోతుంది. గొడవ పెట్టాల్సిందే అని పారు అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి సర్ అంటే ఇంకా సర్ ఏంట్రా మావయ్య అని పిలవమంటాడు.

శ్రీధర్ యొక్క కుట్రలు మరియు చిన్నమ్మ ప్రవర్తన

ఏదో జ్యోత్స్నకు ఇచ్చి పెళ్లి చేసినట్లు అంటున్నావేంటీ దశరథ అని పారు అంటుంది. దాంతో కాంచన కోప్పడుతుంది. ఇలాంటివి మాట్లాడకండి అత్తయ్య. పెళ్లి అయ్యేదాగా కొన్ని భరించాల్సిందే అని సుమిత్ర అంటుంది. నీలో కూడా ఇలాంటి ఆలోచన ఉందంటే నేను రాకపోయేదాన్ని అని కాంచన అంటుంది. అది కాస్తా గొడవగా మారుతుంది.

ఎందుకు పిన్ని గొడవ పెడతావ్. అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు ఓర్చుకోలేని గుణం అని దశరథ్ అంటాడు. పిన్నిని నన్ను అంత మాట అంటావా అని పారు అంటుంది. ఇంతలో శివ నారాయణ వస్తాడు. ఏం జరుగుతుందని శివ నారాయణ అంటే దశరథ్ కవర్ చేస్తాడు. పారును పిలిచి రూమ్‌లో ఉన్న కవర్ తీసుకురా అని పంపిస్తాడు శివ నారాయణ.

పారు ఉన్నట్టుండి గొడవ స్టార్ట్ చేసిందంటే జ్యోత్స్న ప్లాన్ అయింటుంది. అయినా వడ్డీతో సహా ఇచ్చేస్తా అని కార్తీక్ అంటాడు. మగపెళ్లి వాళ్లకు బట్టలు పెట్టాలి. మిగతా వాళ్లకు మీరు పెట్టండి. కానీ, ఇంటి ఆడపడుచుకు నా చేతుల మీదుగా బట్టలు పెట్టాలనుకుంటున్నాను అని శివ నారాయణ అంటాడు. దాంతో కాంచన తెగ సంబరపడిపోతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కావేరి త్యాగంతో కార్తీక్‌కు ఎంతో బాధ కలుగుతుంది. శ్రీధర్‌ యొక్క కుట్రలు విఫలమవుతాయా? చిన్నమ్మ ప్రవర్తనకు ఎలాంటి ఫలితం వస్తుంది? తదుపరి ఎపిసోడ్‌లో మరిన్ని ఉత్కంఠభరిత విషయాలు వెల్లడి అవుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.