
📌 Key Points
- ట్విస్ట్: దీపను చంపాలని చూసిన జ్యోత్స్నే కాపాడింది, స్ట్రాటజీ అంటే ఇదే అంటున్న జ్యో.
- షాకింగ్: చీర కట్టులో జ్యోత్స్న, కార్తీక్ షాక్, అసలు పిల్లి నక్క వేషాలు వేస్తుందన్న కార్తీక్.
- సంచలనం: అడ్డు తొలగించుకుని కార్తీక్ మెడలో మూడు ముళ్లు వేయించుకుంటానంటున్న జ్యోత్స్న.
- హై టెన్షన్: జ్యోత్స్న మాటలకు పారిజాతం ఫైర్, ఉక్కుతాడుతో వాయించాలంటూ వార్నింగ్.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఒక సంచలన ఎపిసోడ్ మీ ముందుకు వచ్చింది. జ్యోత్స్న యొక్క ఊహించని చర్యలు, కార్తీక్ యొక్క షాకింగ్ రియాక్షన్స్ తో ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠగా సాగింది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి!
ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు: జ్యోత్స్న సేవ్
Karthika Deepam 2 Serial April 8th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 8వ ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగింది. దీపను చంపాలనుకుని నేలపై నూనే పోసిన జ్యోత్స్నే దీప పడబోతుంటే పట్టుకుని కాపాడుతుంది. అందరూ ఊహించేది చేస్తేది జ్యోత్స్న ఎందుకవుతుంది అనుకున్న జ్యోత్స్న చీర కట్టుకుని షాక్ ఇస్తుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీప ఇంట్లోకి వస్తూ నేలపై ఉన్న నూనే వల్ల జారి కిందపడబోతుంది. కానీ, ఊహించని విధంగా నేలపై ఆయిల్ పోసి చంపాలని చూసిన జ్యోత్స్నే దీపను కిందపడకుండా పట్టుకుని కాపాడి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దాంతో అంతా దీప అంటూ పరుగెత్తుతారు.
దీపను కాపాడినందుకు జ్యోత్స్నకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. దీపను తీసుకెళ్తాడు కార్తీక్. నా స్ట్రాటజీ వేరే ఉంది బావ. అందరూ ఊహించింది చేస్తే నేను జ్యోత్స్నను ఎందుకు అవుతాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. దీపంటే మండిపడే జ్యోత్స్న కాపాడటం ఏంటీ.. ఏమైనా నా కూతురుకు నాకు ఏం కాలేదు అని దశరథ్ అనుమానిస్తాడు. పైకి వెళ్లిన జ్యోత్స్న జరిగింది తలుచుకుంటూ నవ్వుతుంది.
అందరు నేను నిన్ను కాపాడాను అనుకుంటున్నారు. అసలు నువ్ పడబోయిందే నా వల్ల అని ఎవరికి తెలియదు అని బయటకు అనుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన కార్తీక్ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరు చూడలేదనుకుంటుందట అని పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జ్యోత్స్నకే షాక్ ఇస్తాడు. మా ఇంట్లో ఏ పిల్లి లేదే అని జ్యోత్స్న అంటే ఉంది. పేరుకే పిల్లి కానీ వేసేవన్నీ నక్క వేశాలు అని, కళ్లు మూసుకుని చిల్లర వేశాలు వేస్తుంది అని కార్తీక్ అంటాడు.
కార్తీక్ షాక్: అసలు పిల్లి నక్క వేషాలు
కార్తీక్, జ్యోత్స్న వాదించుకుంటారు. దీప అడ్డు తొలగించుకుని నిన్ను దక్కించుకుంటా. అడ్డు తొలగించడమంటే చంపడమే కాదు మనిద్దరి మధ్య లేకుండా చేయడం, నేను ఇంతకంటే కిందకు దిగజారడానికి, కోల్పోడానికి ఏం లేదు. నా గోల్ ఒక్కటే. నీతో నా మెడలో మూడు ముళ్లు వేయించుకోవడం. అలా అని నీ జీవితంలో ఎవరో ఉంటే నేను నెంబర్లు వేసుకుంటూ బాధపడను. జ్యోత్స్న ఎప్పుడు నెంబర్ వన్నే, నెంబర్ వన్‌గానే ఉంటుంది అని జ్యోత్స్న అంటుంది.
ఆ మాటలు విన్న పారిజాతం చెప్పు తెగుద్ది అని అరుస్తుంది. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. బరితెగించి మీద పడతానంటే ఉక్కుతాడు వేసి వాయించాలి, నాలో టాప్ గేర్ పడింది, టెంపర్ రేగుద్ది, నూనే ఒలకడానికి, ఒలికించావో కనిపెట్టకపోడానికి నేను రెండు కళ్లు ఉన్నదాన్ని కాదు నాలుగు కళ్లు ఉన్నదాన్ని. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని పారిజాతం అంటుంది. జ్యో సంగతి తాను చూసుకుంటానని కార్తీక్‌ను వెళ్లమంటుంది పారు.
తర్వాత దీప ఏ పని చేయొద్దని, తన పనులన్నీ పారిజాతం చేస్తానంటుంది. కార్తీక్, దీపకు దిష్టి తీస్తానంటుంది. దాంతో వాళ్ల మొదటి పెళ్లి రోజు అని చెబుతాడు కార్తీక్. ఇంట్లో అందరికి కార్తీక్, దీప పెళ్లి రోజు అని సంతోషంగా చెబుతుంది. ముందే చెప్పొచ్చుగా, మీకోసం ఏదోటి చేయాలని ఉంటుందిగా అని శివ నారాయణ తిడతాడు. శివ నారాయణ-పారిజాతం, దశరథ్-సుమిత్రల ఆశీర్వాదం తీసుకుంటారు కార్తీక్-జ్యోత్స్న.
జ్యోత్స్న సవాల్: మూడు ముళ్ల కోసం ప్లాన్
ఇప్పుడు సంతోషమేనా మరదలా అని కార్తీక్ అంటే దీప తల ఊపుతుంది. కార్తీక్ సింపుల్ లైఫ్ కోరుకుంటే.. దశరథ్ పొగుడుతాడు. వెన్నెల లాంటి వీళ్ల కాపురంలో అమావాస్య ఎప్పటికీ రాకూడదు అని దశరథ్ అంటాడు. అప్పుడే జ్యోత్స్నను అమావాస్యల చూపిస్తారు. కార్తీక్, దీపలకు పనిష్‌మెంట్ కింద లీవ్, కారు, డబ్బులు ఇస్తున్నానని శివ నారాయణ చెబుతాడు. కారు, డబ్బులు వద్దంటాడు కార్తీక్.
అవునా, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ముందే చెప్పుంటే బొకే తీసుకొచ్చేదాన్ని, నో ప్రాబ్లమ్.. గుడిలో నుంచి వచ్చేటప్పుడు తీసుకుందాం. దీప ఈలోపు నువ్వు వంట చేస్తూ ఉండు నేను బావ గుడికి వెళ్తాం అని జ్యోత్స్న అంటుంది. ఈరోజు వాళ్ల పెళ్లి రోజు అంటే గుడి, వంట అంటావేంటని దశరథ్ అంటాడు. ఈరోజు గుడిలో పాలాభిషేకం చేస్తే పెళ్లి అవుతుందని పంతులు గారు చెప్పారు అని జ్యోత్స్న అంటుంది.
అయితే నేను తీసుకెళ్తాను అని శివ నారాయణ అంటాడు. పూజకు రూల్స్ ఉన్నట్లే సంకల్పానికి రూల్స్ ఉన్నాయి. నేను పెళ్లి చేసుకోవాలని సంకల్పించుకున్నా. నాకు పెళ్లికొడుకును చూసే బాధ్యత బావ తీసుకున్నాడు కాబట్టి బావను తీసుకెళ్లి మొక్కు తీర్చుకోవాలని సంకల్పించుకున్నా అని జ్యోత్స్న తిరకాసు పెడుతుంది. వాళ్ల పెళ్లి రోజు అని దశరథ్, పారిజాతం అంటారు.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. జ్యోత్స్న ప్లాన్స్, కార్తీక్ రియాక్షన్స్ తో మరింత ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


