
ఆహా ఓటీటీలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘యుగి’ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘కార్తిక-మిస్సింగ్ కేస్’ గా విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథిర్, నరేన్ తో పాటు మరికొందరు నటించారు.
Key Points
ఆహా ఓటీటీలో 'కార్తిక-మిస్సింగ్ కేస్' సినిమా స్ట్రీమింగ్.
తమిళ సినిమా 'యుగి' తెలుగు డబ్బింగ్ వెర్షన్.
కథిర్, నరేన్, ఆనంది, పవిత్ర లక్ష్మి నటన.
కార్తిక మిస్సింగ్ కేస్: కథాంశం
Karthika Missing Case : రెగ్యులర్ గా ఆహా ఓటీటీ కొత్త సినిమాలు, కొత్త షోలతో సందడి చేస్తుంది. అంతే కాకుండా తమిళ్, మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి ప్రతివారం ఓ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నేడు ఆహా ఓటీటీలో మరో సూపర్ హిట్ తమిళ్ డబ్బింగ్ సినిమా అందుబాటులోకి వచ్చింది.
కథిర్, నరేన్, ఆనంది, పవిత్ర లక్ష్మి.. పలువురు కీలక పాత్రల్లో జాక్ హారిస్ దర్శకత్వంలో 2022లో తెరకెక్కిన తమిళ్ సినిమా యుగి. ఇదే మలయాళంలో ‘అదృశ్యం’గా రిలీజయింది. ఒక అమ్మాయి మిస్ అయి మర్డర్ అయ్యే కథతో థ్రిల్లింగ్ గా సాగుతుంది ఈ సినిమా. తెలుగులో ఈ సినిమా ‘కార్తిక-మిస్సింగ్ కేస్’ అనే టైటిల్ తో రిలీజయింది.
నటీనటులు మరియు దర్శకుడు
ఆహా ఓటీటీలో విడుదల
తెలుగులో ఆహా ఓటీటీలో నేటి నుంచి ఈ కార్తిక-మిస్సింగ్ కేస్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో భవాని మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మీరు కూడా ఆహా ఓటీటీలో చూసేయండి.
మొత్తంగా, ‘కార్తిక-మిస్సింగ్ కేస్’ సినిమా థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించే సినిమా. ఆహా ఓటీటీలో ఈ సినిమాను వీక్షించండి.


