|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కరుప్పు సంచలనం! బ్లాక్‌బస్టర్ హిట్‌తో బాలీవుడ్‌ను షేక్ చేయనున్న సూర్య!

Published: 31-05-2026, 6:31 AM
కరుప్పు సంచలనం! బ్లాక్‌బస్టర్ హిట్‌తో బాలీవుడ్‌ను షేక్ చేయనున్న సూర్య!
  • సూర్య ‘కరుప్పు’ తెలుగు, తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.
  • త్రిష హీరోయిన్‌గా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.
  • మే 15న విడుదలై రెండు వారాలుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
  • ప్రేక్షకుల అపారమైన ప్రేమతో ఇప్పుడు హిందీలో విడుదల కానుంది; ట్రైలర్ రిలీజ్.

సూర్య ‘కరుప్పు’ సినిమాతో సృష్టించిన సంచలనం ఇంకా కొనసాగుతోంది! తెలుగు, తమిళంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతోంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ హిందీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

బ్లాక్‌బస్టర్‌గా ‘కరుప్పు’: వసూళ్ల సునామీ!

ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మే 15న వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి.. రెండు వారాలు అవుతున్న పలు చోట్ల ఇప్పటికి థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తెలుగులో, తమిళంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందడంతో ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు హిందీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ.. ‘తమిళం, తెలుగు భాషల్లో మీ అపారమైన ప్రేమను పొంది… ఇప్పుడు హిందీలో మీ ముందుకు వస్తున్నాం.. కరుప్పు హిందీ ట్రైలర్ వచ్చేసింది.. ఎమోషనల్ రైడ్‌ను వీక్షించండి’ అంటూ చెప్పుకొచ్చారు.

హిందీలో సూర్య సత్తా: ట్రైలర్ అవుట్!

కొలివుడ్‌, టాలీవుడ్‌ దాటి బాలీవుడ్‌కు!

‘కరుప్పు’ హిందీ విడుదల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సూర్య మార్క్ యాక్షన్, ఎమోషన్ బాలీవుడ్‌లోనూ మ్యాజిక్ చేస్తుందని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.