|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మార్కో నిర్మాతల నుంచి కట్టలన్- 45 కోట్ల బడ్జెట్- స్టోరీ లైన్‌తో పూజా ప్రజంటేషన్- సునీల్‌తో పాటు నటించే తారలు వీళ్లే!

Published: 25-08-2025, 7:02 AM

మలయాళంలో విజయవంతమైన ‘మార్కో’ చిత్ర నిర్మాతలు తమ తదుపరి చిత్రం ‘కట్టలన్’ ను ప్రకటించారు. 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. సునీల్, రాజిషా విజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Key Points

1

45 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'కట్టలన్'.

2

మలయాళ బ్లాక్ బస్టర్ 'మార్కో' నిర్మాతల నుండి వస్తున్న కొత్త చిత్రం.

4

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఖాంఫక్డీ స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు.

కట్టలన్ సినిమా పూజా కార్యక్రమం

మలయాళం నుంచి వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా మార్కో. ఈ సినిమా నిర్మాతల నుంచి మరో క్రేజీ మూవీ రానుంది. ఆ సినిమానే కట్టలన్ . క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మార్కో తర్వాత వస్తున్న సినిమా ఇది.

భారీ ప్రాజెక్ట్‌గా కట్టలన్ సినిమాను ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌‌గా రూపొందనున్న కట్టలన్ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో అద్భుతంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో బాహుబలి లో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అలాగే, లగ్జరీ కార్లు, బైక్‌లు కూడా ఈవెంట్‌ను మరింత స్పెషల్ చేశాయి. సినిమాలోని స్టోరీ లైన్‌ను దృష్టిలో పెట్టుకుని పూజా ప్రజెంటేషన్ కూడా డిజైన్ చేశారు. ఈ ఈవెంట్‌లోని నటీనటులకు ఆ ప్రజంటేషన్ అందజేశారు. ఈవెంట్‌లో యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ లాంటి స్టార్‌లు హాజరై గ్లామర్‌ని మరింత పెంచారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

సుమారు రూ. 45 కోట్లు బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ పాన్-ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ కట్టలన్ టైటిల్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయింది. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంతార, మహారాజా సినిమాలతో సౌత్‌లో సంచలనం సృష్టించిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

‘మార్కో’ కోసం కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ని తీసుకొచ్చిన క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఇప్పుడు మరో బిగ్ కంపోజర్‌ని తీసుకొచ్చింది. టైటిల్ డిజైన్ కోసం జైలర్, లియో, జవాన్, కూలీ సినిమాలకు పనిచేసిన ఐడెంట్ లాబ్స్‌ని తీసుకున్నారు.

సినిమా విశేషాలు

కట్టలన్ మూవీలో హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటించనున్నారు. నటీనటుల్లో తెలుగు యాక్టర్ సునీల్ , ‘మార్కో’తో మలయాళంలో పాపులర్ అయిన కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, తెలుగు నటుడు రాజ్ తిరందాసు, అలాగే సీనియర్ నటులు జగదీష్, సిద్దిక్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పొన్నియన్ సెల్వన్ 1, బాహుబలి 2, జవాన్ , బాఘీ 2 వంటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేసిన వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ సినిమాలో కూడా స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. డైలాగ్స్ ఉన్నీ ఆర్, ఎడిటర్ షమీర్ మహమ్మద్, ప్రొడక్షన్ కంట్రోలర్ దీపక్ పరమేశ్వరన్ చేస్తున్నారు.

మొత్తంమీద, ‘కట్టలన్’ సినిమా భారీ బడ్జెట్ మరియు ప్రతిభావంతులైన నటీనటులతో అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.