
📌 Key Points
- సునీల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ‘మర్యాద రామన్న’ సినిమాలోని ట్రైన్ సీన్ అదుర్స్!
- రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సునీల్ హీరోగా, సలోని హీరోయిన్‌గా నటించారు.
- రియల్ లైఫ్‌లో ‘మర్యాద రామన్న’ సీన్ రిపీట్ కావడంతో నెటిజన్లు షాక్!
- కిటికీకి ఉన్న ఇనుప కడ్డీలను వంచి కొబ్బరి బోండా కొట్టేసిన వ్యక్తి వీడియో వైరల్.
టాలీవుడ్ నటుడు సునీల్ నటించిన మర్యాద రామన్న సినిమాలోని సీన్ రిపీట్ అయింది. అచ్చుగుద్దినట్టు దించేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మర్యాద రామన్న సినిమాలో ట్రైన్ సీన్ గుర్తుందా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్ ప్రారంభంలో కామెడీ చేస్తూ అందరిని మెప్పించిన సునీల్, ఆ తర్వాత హీరోగా ఎదిగారు. సునీల్ హీరోగా చాలా సినిమాలే వచ్చాయి. అందులో ఒకటి మర్యాద రామన్న. ఈ సినిమా సునీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సునీల్ హీరోగా చేయగా సలోని హీరోయిన్ గా మెరుసారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీలో ట్రైన్ సీన్ అందరికి నవ్వు తెప్పిస్తుంది. కొబ్బరి బోండాను కిటికీ బయటి నుంచి ఎలా దక్కించుకుంటాడని దానిపైన ఈ సీన్ ఉంటుంది.
రియల్ లైఫ్‌లో సీన్ రిపీట్.. వీడియో వైరల్
థియేటర్ లో ఈ సీన్ రాగానే అందరూ నవ్వుకుంటారు. అయితే అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో ఒకటి జరిగింది. ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో ట్రైన్ లో జర్నీ చేస్తున్నాడు. సునీల్ తరహాలోనే ఓ కొబ్బరి బోండా తీసుకొని, ఇరుక్కున్నాడు సదర్ ప్రయాణికుడు. ఫోటోలో చూపించినట్లుగా కిటికీ అవతల కొబ్బరి బోండా ఉండగా, దానిని దక్కించుకునేందుకు సదరు ప్రయాణికుడు విశ్వప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే కిటికీకి ఉన్న ఇనుప కడ్డీలను వంచి మరీ, ఆ కొబ్బరి బోండాను సాధిస్తాడు. ఆ తర్వాత ఆయన భార్యకు ఇవ్వడంతో ఆమె సంతోషపడుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసిన జనాలందరూ… మర్యాద రామన్న సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.
నెటిజన్లు షాక్.. రాజమౌళి సినిమా మ్యాజిక్!
Real life #MaryadaRamanna 😂 @ssrajamouli @Shobu_ @suneeltollywood pic.twitter.com/sVuPV8a4LO
మర్యాద రామన్న సినిమా సీన్ రిపీట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి.


