
📌 Key Points
- రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన ‘పెద్ది’ గ్లింప్స్ వైరల్.
- గ్లింప్స్‌లో రామ్ చరణ్ హనుమంతుని అవతార్‌లో కనిపించడంతో మరింత ఆదరణ.
- సినిమాలో క్రికెట్, కుస్తీ ఉండటంపై నెటిజన్ల ట్రోలింగ్.
- టీజర్‌లో రన్నింగ్, జావెలిన్ త్రో వంటి ఆటలు ఉంటాయనే ట్రోల్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఈ గ్లింప్స్‌లో క్రికెట్, కుస్తీ వంటి అంశాలు ఉండటంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.
వైరల్ అవుతున్న ‘పెద్ది’ గ్లింప్స్
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజు స్పెషల్‌గా వదిలిన ‘పెద్ది’ (Peddi) పెహల్వాన్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. నెటిజన్లు, అభిమానులు, ఇతర హీరోల అభిమానులందరూ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఈ గ్లింప్స్‌ని వైరల్ చేశారు. అందులోనూ శ్రీరామనవమి కావడంతో పాటు, గ్లింప్స్‌లో రామ్ చరణ్ (Ram Charan) హనుమంతుని అవతార్‌లో కనిపించడంతో.. ఈ సంచలనాన్ని ఆపడం ఎవరి వల్లా కాలేదు. అయితే గ్లింప్స్ అందరికీ నచ్చినా, కొందరు మాత్రం దీనిని మీమ్స్ మెటీరియల్‌గా కొట్టిపడేశారు. అవును, ఇంతకు ముందు వచ్చిన గ్లింప్స్, ‘రై రై రారా’ సాంగ్స్‌లో క్రికెట్ బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఇప్పుడొచ్చిన గ్లింప్స్‌లోనేమో కుస్తీ అంటూ కన్ఫ్యూజ్ చేసేశారు. అందుకే కొందరు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
ముఖ్యంగా ఒక ఓల్డ్ వీడియోను షేర్ చేస్తూ.. ‘పెద్ది నెక్ట్స్ టీజర్’ ఇదే అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో రన్నింగ్ కాంపిటేషన్, జావెలిన్ త్రో, షాట్‌పుట్ వంటి ఆటలు ఉన్నాయి. అంటే, క్రికెట్ అయింది, ఇప్పుడు కుస్తీ అన్నారు. ఇక రాబోయే టీజర్.. ఈ వీడియోలో ఉన్న కంటెంటే అనేలా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఉన్న హీరో ఎవరనే దానిపై కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇందులో ఉన్నది అన్నగారు ఎన్టీఆర్ అని కొందరు అంటుంటే, కాదు.. ఎమ్జీర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన వారిపై మెగా ఫ్యాన్స్ అయితే విరుచుకుపడుతున్నారు. ‘అప్పుడే ఏడుపు మొదలైంది’ అంటూ వారికి ఇవ్వాల్సిన రీతిలో ఇచ్చి పడేస్తున్నారు. ఒకసారి క్రికెట్, ఇంకోసారి కుస్తీ అని చెబుతున్నారు సరే.. సినిమాలో వీటిపై స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ఓకే.. లేదంటే మాత్రం రిజల్ట్ దారుణంగా ఉంటుంది. మరి బుచ్చిబాబు ఏం చెప్పాలనుకుంటున్నాడో.. తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 30 వరకు (ప్రస్తుతం అనుకుంటున్న డేట్.. మారే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి) వెయిట్ చేయాల్సిందే.
ట్రోల్స్‌తో సినిమాపై అంచనాలు
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా యమా స్వింగ్‌లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సెట్‌లో రామ్ చరణ్‌కి చిన్న ప్రమాదం సంభవించినట్లుగా వార్తలు రావడంతో అభిమానులంతా ఆందోళన చెందారు. కానీ, మరుసటి రోజు చరణ్ షూటింగ్‌లో పాల్గొనడంతో.. అంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక ఈ సినిమా షూట్‌కి సంబంధించి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందనేది తెలియాల్సి ఉంది.
Peddi final teaser… pic.twitter.com/9CrgJTBW3m
సినిమాలో క్రీడల గందరగోళం
— Nani (@Ravanaroy) March 27, 2026
ఏది ఏమైనా, బుచ్చిబాబు ఈ సినిమాలో ఏం చూపించాలనుకుంటున్నాడో తెలియాలంటే ఏప్రిల్ 30 వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఈ ట్రోల్స్, అంచనాలు కొనసాగుతూనే ఉంటాయి.

