|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది సక్సెస్: “నా కెరీర్‌లోనే నెంబర్ 1 సినిమా!” – రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు!

Published: 08-06-2026, 5:00 PM
పెద్ది సక్సెస్: "నా కెరీర్‌లోనే నెంబర్ 1 సినిమా!" - రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు!
  • ‘పెద్ది’ సినిమా నెగిటివ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
  • రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తన పర్సనల్ లైబ్రరీలో నెంబర్ 1 సినిమాగా అభివర్ణించారు.
  • ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి, ఎమోషనల్ సీన్స్‌కు వారి స్పందన చూసి చరణ్ ఆశ్చర్యపోయారు.
  • దర్శకుడు బుచ్చిబాబు ‘ఖేలో ఇండియా’ స్ఫూర్తితో ఈ కథను రాసినట్లు వెల్లడించారు.

“పెద్ది” సినిమా అనూహ్య విజయంపై హీరో రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. నెగిటివ్ టాక్‌ను అధిగమించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం తన కెరీర్‌లోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని చరణ్ పేర్కొన్నారు. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి సక్సెస్ మీట్‌లో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘పెద్ది’ విజయం: నెగిటివ్ టాక్‌ను అధిగమించి

Peddi Success: పెద్ది…నిజాయతీగా, మనస్ఫూర్తిగా కష్టపడితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపించిన సినిమా. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, నెగిటివ్ టాక్‌ను తట్టుకుని మరీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా  తాజాగా ‘థాంక్ యూ మీట్’ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది మూవీ టీమ్.

ఈ సక్సెస్ మీట్‌లో హీరో రామ్ చరణ్ పంచుకున్న ఎమోషనల్ కామెంట్స్, దర్శకుడు బుచ్చిబాబు సినిమా వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరించిన తీరు, అలాగే ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ నెగిటివ్ రివ్యూవర్లపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు నెట్టింట తెగ హైలెట్ అవుతున్నాయ్.రామ్ చరణ్ మాట్లాడుతూ, మనం ఒక పనిని మనస్ఫూర్తిగా, నమ్మి చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని పెద్ది సినిమాతో మరోసారి రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎవరో చెబితేనో, పుష్ చేస్తేనో చేసిన సినిమా కాదని, బుచ్చిబాబు చెప్పిన లైన్‌ను నమ్మి ప్రాణం పెట్టి చేసిన చిత్రమని పేర్కొన్నారు.

రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్: నా నెంబర్ 1 సినిమా

చాలా కాలం తర్వాత థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశానని, తాను అస్సలు ఊహించని ఎమోషనల్ సీన్స్‌కు కూడా థియేటర్లలో చప్పట్లు, ఈలలు పడటం చూసి ఆశ్చర్యపోయానని, ఇది తన కెరీర్‌లోనే ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు చరణ్. తన పర్సనల్ లైబ్రరీలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచే సినిమా ఇదని, మొదటిసారి కథ వినగానే బుచ్చిబాబును హగ్ చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల తర్వాత చరణ్ చేసిన ఈ ప్రయోగం నిజంగానే మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా సినిమాలో జగపతిబాబు నటన చూసి ఒక నటుడిగా తానే ఎమోషనల్ అయ్యానని చరణ్ ఆకాశానికి ఎత్తేశారు.

మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, ఇది కేవలం రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని, ఒక యువకుడి స్ఫూర్తినింపే ప్రయాణమని వివరించారు. భారతీయ జీవన విధానంలో క్రీడలు ఎలా భాగమయ్యాయో చూపించడానికి ఈ స్టోరీ రాసే క్రమంలో ‘ఖేలో ఇండియా’ను కూడా స్ఫూర్తిగా తీసుకున్నానని వెల్లడించారు.

దర్శకుడు బుచ్చిబాబు, అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు

ఇక ఈ ప్రెస్ మీట్‌లో అసలు సిసలైన హైలైట్ ఏంటంటే.. ప్రముఖ రైటర్ అనంత శ్రీరామ్ నెగిటివ్ రివ్యూలు రాసేవారిపై తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో విరుచుకుపడటం. పరాన్నజీవుల్లా బతుకుతూ, పైశాచిక ఆనందం పొందుతూ విషం కక్కే వాళ్లు సృష్టించే భావ దారిద్యపు బాలారిష్టాలను దాటుకుని మరీ మా ‘పెద్ది’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిందని ఆయన ఘాటుగా స్పందించారు.రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, పడిన కష్టం గురించి అద్భుతమైన కవిత్వంతో ప్రశంసించారు. బుచ్చిబాబు ఊహించిన పెద్ది పాత్ర కోసం చరణ్ గారే రాయిగా, తనే శిల్పిగా, తనే ఉలిగా మారి తనని తాను చెక్కుకుని, ఆ శిల్పానికి నటనతో జీవం పోశారంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అనంత శ్రీరామ్ ఎమోషనల్ అయ్యారు.

ఈ ప్రెస్ మీట్‌లో నటుడు జగపతిబాబు, నిర్మాతలు సతీష్ కిలారు, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చూడాలి మరి చరణ్ బుచ్చిబాబు నమ్మి చేసిన ఈ పెద్ది మూవీ ఇంకెన్ని రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుందో !

“పెద్ది” విజయం కేవలం బాక్సాఫీస్ లెక్కలకే పరిమితం కాదని, నిజాయితీగా చేసిన కృషికి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణకు నిదర్శనమని రామ్ చరణ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి నాంది పలికింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.