
📌 Key Points
- వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు లీక్.
- జూన్ మూడో వారంలో సినిమా నుండి అదిరిపోయే స్పెషల్ గ్లింప్స్ రాబోతుంది.
- మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు, అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
- మేర్లపాక గాంధీ దర్శకత్వంలో UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణం.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు ఇది నిజంగా పండగే! ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా రిలీజ్ డేట్ లీక్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడానికి వరుణ్ తేజ్ సిద్ధమవుతున్నాడు. ఈ మాస్ అప్డేట్ మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది.
కొరియన్ కనకరాజు: మెగా హీరోకి హిట్ తప్పదా?
మెగా హీరో వరుణ్ తేజ్ హిట్ కోసం గత కొద్ది కాలంగా సమమతమవుతున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశినంత స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం నిరాశ చెందుకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఇందులో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన కాన్పెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంతశాతం పూర్తి కాగా.. విడుదలైన టీజన్, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను సొంతం చేసుకున్నాయి.
ఇక ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ‘కొరియన్ కనకరాజు’ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.అంతేకాకుండా జూన్ మూడో వారంలో స్సెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రిలీజ్ డేట్ లీక్: ఆగస్టు 7న థియేటర్లలో రచ్చ!
జూన్‌లో స్పెషల్ గ్లింప్స్: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ కోసం ఎదురుచూపులు మరింత ఉత్కంఠగా మారాయి. ఆగస్టు 7న థియేటర్లలో మెగా రచ్చ ఖాయం. అధికారిక ప్రకటన, జూన్ గ్లింప్స్ కోసం వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ట్యూన్ అయి ఉండండి!


