|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

katrinakaif: ‘నా తల్లి బ్రిటిష్ వనిత అయినప్పటికీ భారతదేశం ఎల్లప్పుడూ నా ఇల్లే’.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్

Published: 09-05-2025, 10:49 AM
katrinakaif: ‘నా తల్లి బ్రిటిష్ వనిత అయినప్పటికీ భారతదేశం ఎల్లప్పుడూ నా ఇల్లే’.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తల్లి బ్రిటిష్ వనిత అయినప్పటికీ, భారతదేశం తనకు ఎల్లప్పుడూ ఇల్లేనని ఆమె పేర్కొంది.

Key Points

1

కత్రినా కైఫ్ భారతీయ గుర్తింపుపై గర్వం వ్యక్తం చేసింది.

2

ఆమె తండ్రి భారతీయుడు, తల్లి బ్రిటిష్ వనిత అని తెలిపింది.

4

17 ఏళ్ల నుంచి భారతదేశంలోనే నివసిస్తున్నానని కత్రినా తెలియజేసింది.

కత్రినా కైఫ్ వైరల్ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోయిన్ అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. కోట్లలో అభిమానుల్ని సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరి చిత్రంతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్‌లో భూమ్ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లో కూడా బోలెడన్నీ అవకాశాలు సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.

భారతీయ గుర్తింపుపై కత్రినా అభిప్రాయం

కత్రినా కైఫ్ తన భారతీయ గుర్తింపును గర్వంగా చెప్పుకుంది. “నేను భారతీయురాలిని, నా తండ్రి భారతీయుడు అని వెల్లడించింది. నాకు భారతీయ వారసత్వం ఉందని పేర్కొంది. వేర్వేరు పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్న నటీమణులు చాలా మంది ఉన్నారని.. వివిధ కారణాల వల్ల ఒకరు వేరే పాస్‌పోర్ట్ కలిగి ఉండవచ్చని.. కానీ నా తండ్రి భారతీయుడు అదే నా మూలమని చెప్పుకొచ్చింది.

దేశంతో తనకున్న లోతైన సంబంధాన్ని నొక్కి చెప్పింది. అంతేకాకుండా.. నా తల్లి బ్రిటిష్ వనిత అయినప్పటికీ, భారతదేశం ఎల్లప్పుడూ నా ఇల్లు అని గర్వంగా తెలిపింది. నాకు 17 సంవత్సరాల వయస్సు నుంచి నేను ఇక్కడే నివసిస్తున్నానని.. ఇదే నా ఇల్లని.. నేను నివసించే, పనిచేసే దేశం ఇదేనని వెల్లడించింది.

దేశంతో కత్రినా లోతైన సంబంధం

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

చివరగా, కత్రినా కైఫ్ తన భారతీయతపై గల గౌరవాన్ని, దేశంతో తనకున్న అనుబంధాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా చాటుకుంది. ఆమె మాటలు అనేక మందికి స్ఫూర్తినిచ్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.