|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ సినిమాలో డబ్బునే ప్రేమిస్తా.. కయాదు లోహర్ వైరల్ కామెంట్స్ వెనుక అసలు కథ!

Published: 02-01-2026, 11:30 PM
ఆ సినిమాలో డబ్బునే ప్రేమిస్తా.. కయాదు లోహర్ వైరల్ కామెంట్స్ వెనుక అసలు కథ!
  • కయాదు లోహర్ ‘ఫంకీ’ సినిమాలో ‘చిత్ర’ అనే నిర్మాత కూతురు పాత్రలో నటిస్తోంది.
  • ఆమె పాత్ర డబ్బును అమితంగా ప్రేమించేదిగా, మనీ మేనేజ్‌మెంట్‌ గురించి మాట్లాడుతుంది.
  • విశ్వక్ సేన్ ఈ చిత్రంలో దర్శకుడి పాత్రలో కనిపించనున్నారు.
  • అనుదీప్ దర్శకత్వంలో ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ చిత్రం విడుదల కానుంది.

యంగ్ బ్యూటీ కయాదు లోహర్ తన కొత్త సినిమా ‘ఫంకీ’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన ఈ చిత్రంలో ఆమె ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. డబ్బును అమితంగా ప్రేమించే తన పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కయాదు లోహర్ సినీ ప్రస్థానం

శ్రీవిష్ణు(Sri Vishnu) నటించిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ కయాదు లోహార్‌ (Kayadu Lohar) మనందరికీ సుపరిచితమే. ఇక ఈ భామ అందానికి కుర్రకారు మెస్మరైజ్ అయ్యారు. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా గత ఏడాది యంగ్ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌(Pradeep Ranganathan)తో కలిసి ‘డ్రాగన్‌’(Dragon) సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీబిజీగా ఉంటుంది. ఇక ఈ చిన్నది సినిమాలతోనే కాదు సోషల్ మీడియాతోనూ ఎప్పటికపుడు నెటిజన్లు, మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తుంటుంది.

ఫంకీ సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకత

ఇదిలా ఉంటే.. కయాదు నటిస్తున్న సినిమాలో ‘ఫంకీ’(Funkey) ఒకటి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్(anudeep) దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

వైరల్ అవుతున్న కయాదు వ్యాఖ్యలు

ఆమె మాట్లాడుతూ.. ‘ఇది సినిమా నేపథ్యంతో కూడిన కథ. ఇందులో నేను నిర్మాత కూతురుగా కనిపిస్తా. నా క్యారెక్టర్‌ పేరు చిత్ర. తండ్రి డబ్బుని ఆదా చేయాలని ఆశించే కూతురు పాత్ర. అంతేకాదు, మనీ మేనేజ్మెంట్‌ గురించి తను ఎక్కువగా మాట్లాడుతుంటుంది. డబ్బుని అమితంగా ప్రేమిస్తుంది. నిజంగా విభిన్నమైన పాత్రని చెప్పవచ్చు. విశ్వక్‌ ఇందులో డైరెక్టర్‌గా కనిపిస్తారు. మా ఇద్దరి కాంబినేషన్‌ సీన్స్‌ వినోదాత్మకంగా ఉంటాయి. దర్శకుడు అనుదీప్‌ రాసుకున్న కథలోనే తెలియని ఫన్‌ ఉంది. అదేంటో రేపు మీరు థియేటర్లలో చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

కయాదు లోహర్ తన ‘ఫంకీ’ సినిమా పాత్ర గురించి చేసిన విలక్షణ వ్యాఖ్యలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తించాయి. ఆమె చెప్పిన ‘డబ్బు ప్రేమ’ వెనుక ఉన్న అసలు కారణం, సినిమాలోని ఫన్ కోసం ఫిబ్రవరి 13న థియేటర్లకు వెళ్లాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.