|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేడీ మూవీ సాంగ్ పై దారుణ ట్రోల్స్! డబుల్ మీనింగ్ లిరిక్స్ తో రచ్చ.. వెంటనే డిలీట్!

Published: 17-03-2026, 12:35 PM
కేడీ మూవీ సాంగ్ పై దారుణ ట్రోల్స్! డబుల్ మీనింగ్ లిరిక్స్ తో రచ్చ.. వెంటనే డిలీట్!
  • కేడీ ది డెవిల్ మూవీలోని ‘సర్కే చునర్ తేరి సర్కే’ సాంగ్ పై దారుణమైన ట్రోల్స్, నెటిజన్ల ఆగ్రహం!
  • పాటలో డబుల్ మీనింగ్ లిరిక్స్, వల్గర్ కొరియోగ్రఫీతో చిన్నపిల్లలపై ప్రభావం చూపే విధంగా ఉందని విమర్శలు!
  • ముంబైకి చెందిన లాయర్ CBFCకి ఫిర్యాదు చేయడంతో సాంగ్ ను యూట్యూబ్ నుండి తొలగించిన నిర్మాతలు!
  • మిగిలిన భాషల్లో లిరిక్స్ మార్చడంతో కాంట్రవర్సీ తగ్గింది, తెలుగులో చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

కేడీ ది డెవిల్ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘సర్కే చునర్ తేరి సర్కే’ విడుదలైన కొన్ని గంటల్లోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. డబుల్ మీనింగ్ లిరిక్స్, అసభ్యకరమైన కొరియోగ్రఫీతో ఈ పాటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

నోరా ఫతేహి సాంగ్ పై ట్రోల్స్ వెల్లువ!

KD Song : సినిమాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లో ఈ మధ్య గ్లామర్‌ శ్రుతి మించుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు లిరిక్స్ కూడా మరింత వల్గర్‌గా ఉంటున్నాయి. లేటెస్ట్‌గా ఓ పాన్‌ ఇండియా సినిమా ఇలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేస్తోంది. దీంతో సోషల్‌ మీడియాలో ఆ సాంగ్‌పై పెద్ద రచ్చే జరుగుతోంది.

కన్నడ యాక్షన్‌ హీరో ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కేడీ ది డెవిల్‌. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా కేవీఎన్‌ నిర్మాతలు ప్రొడ్యూస్‌ చేస్తోన్న ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, శిల్పా శెట్టి ఇంపార్టెంట్ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి హిందీలో నోరా ఫతేహి చేసిన ‘సర్కే చునర్‌ తేరి సర్కే..’ స్పెషల్‌ సాంగ్‌ ని రిలీజ్ చేసారు. దీంతో ఈ సాంగ్ నెట్టింట కాంట్రవర్సీ అవుతోంది.

డబుల్ మీనింగ్ లిరిక్స్ తో వివాదం!

ఈ పాటని బాలీవుడ్ లో రకీబ్ ఆలం రాశారు. కేడీ ది డెవిల్‌ సినిమాలో నోరా ఫతేహి చేసిన ఈ స్పెషల్‌ సాంగ్‌పై ఫైర్‌ అవుతున్నారు ఆడియెన్స్‌, నెటిజన్లు. సాంగ్‌ లిరిక్స్‌ డబుల్‌ మీనింగ్‌తో ఉన్నాయని, కొరియోగ్రఫీ కూడా చాలా వల్గర్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. సినిమా నుంచి ఈ స్పెషల్‌ సాంగ్‌ని తొలగించాలని కోరుతున్నారు. ఇలాంటి పాటలను చిన్నపిల్లలు రీల్స్‌లో అనుకరిస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.

సర్కే చునర్ తేరి సర్కే.. సాంగ్‌ ని బ్యాన్‌ చేయాలని ముంబైకి చెందిన ఓ లాయర్ CBFCతో పాటు మినిస్టరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కి కంప్లైట్‌ చేశారు. సాంగ్‌ లిరిక్స్‌ అండ్‌ విజువల్స్‌ వల్గర్‌గా ఉన్నాయని కంప్లైంట్‌ ఫైల్‌ చేశారు. దీంతో దెబ్బకి కేడీ ది డెవిల్‌ సినిమాలోని నోరా ఫతేహి స్పెషల్‌ సాంగ్‌ హిందీ వర్షన్‌ ఇప్పుడు యూట్యూబ్‌ నుంచి తొలగించారు మేకర్స్.

వెంటనే స్పందించిన కేడీ మూవీ టీమ్!

అయితే మిగిలిన భాషల్లో కూడా ఈ పాటని రిలీజ్ చేసారు. కానీ లిరిక్స్ మార్చడంతో వాటిపై అంత కాంట్రవర్సీ రాలేదు. ఈ పాట తెలుగు వర్షన్‌కి చంద్రబోస్‌ లిరిక్స్‌ అందిచకగా సింగర్‌ మంగ్లీ ఆలపించారు. మరి మిగిలిన లాంగ్వేజెస్‌లో కూడా ఈ స్పెషల్‌ సాంగ్‌ రిమూవ్‌ చేస్తారా లేదా అనేది చూడాలి. సినిమాలో ఈ పాట ఉంటుందా? లిరిక్స్ మార్చి పెడతారా చూడాలి మరి. సాంగ్ డిలీట్ చేసినా ప్రోమో మాత్రం అలాగే ఉంచారు.

వివాదంగా మారిన సాంగ్ ప్రోమో ఇక్కడ చూసేయండి..

కేడీ మూవీ సాంగ్ వివాదం సద్దుమణిగిందా? మిగిలిన భాషల్లో కూడా పాటను తొలగిస్తారా? వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.