|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కీర్తి సురేష్ మూవీ హవా.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల్లో చోటు.. టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

Published: 07-07-2025, 10:24 AM
కీర్తి సురేష్ మూవీ హవా.. ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల్లో చోటు.. టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

కీర్తి సురేష్, సుహాస్ నటించిన ఉప్పు కప్పురంబు సినిమా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది. గత వారం ఓటీటీలో ఎక్కువగా చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఈ కథనం వివరిస్తుంది.

Key Points

1

ఉప్పు కప్పురంబు ఓటీటీలో 4వ స్థానంలో నిలిచింది.

2

రైడ్ 2 5.5 మిలియన్ వ్యూస్‌తో టాప్‌లో ఉంది.

4

టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఆధిపత్యం.

ఉప్పు కప్పురంబు ఓటీటీలో సత్తా

కీర్తి సురేష్, సుహాస్ నటించిన మూవీ ఉప్పు కప్పురంబు నేరుగా ఓటీటీలోకి వచ్చిన విషయం తెలుసు కదా. జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు జూన్ 30 నుంచి జులై 6 వరకు ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాలో ఈ మూవీ కూడా చోటు దక్కించుకుంది.

ఓటీటీ ల్లో ప్రతి వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జూన్ 30 నుంచి జులై 6తో ముగిసిన గత వారానికి సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది.

ఇందులో తెలుగు మూవీ, నేరుగా ప్రైమ్ వీడియో లోకే వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమా 4వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా గత వారం 2 మిలియన్ల వ్యూస్ సాధించింది. అది కూడా కేవలం ఇండియాలోనే, కనీసం 30 నిమిషాల పాటు చూసిన వ్యూస్ నే పరిగణనలోకి తీసుకుంటారు.

టాప్ 5 సినిమాల జాబితా

ఇక టాప్ 5 సినిమాల జాబితాలో ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాలే చోటు దక్కించుకున్నాయి. గతవారం ఎక్కువ మంది చూసిన సినిమాగా రైడ్ 2 నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమాకు గతవారం 5.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక రెండో స్థానంలో జియోహాట్‌స్టార్ లో ఉన్న కేసరి ఛాప్టర్ 2 మూవీకి 3 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.

మూడో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి గతవారమే వచ్చిన థగ్ లైఫ్ నిలిచింది. ఈ సినిమాకు 2.4 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. నాలుగో స్థానంలో ఉప్పు కప్పురంబు ఉండగా.. ఐదో స్థానంలో ప్రైమ్ వీడియోలోని హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీకి 1.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

టాప్ 5 వెబ్ సిరీస్ జాబితా

ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన దాని ప్రకారం గతవారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 వెబ్ సిరీస్ జాబితా ఇలా ఉంది. ప్రైమ్ వీడియోలోని పంచాయత్ సీజన్ 4 తన సత్తా చాటుతూనే ఉంది. ఈ సిరీస్ కు గత వారం కూడా ఏకంగా 7.8 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. రెండో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన స్క్విడ్ గేమ్ సీజన్ 3కి 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

మూడోస్థానంలో జియోహాట్‌స్టార్ లోని క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ ఉంది. దీనికి గత వారం 4.8 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ లోని ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి గత వారం 3.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఐదో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని రియాల్టీ షో ది ట్రైటర్స్ ఉంది. దీనికి గతవారం 3.1 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి.

మొత్తానికి, ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కీర్తి సురేష్ సినిమా కూడా మంచి స్పందన తెచ్చుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.