
📌 Key Points
- కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ జోడీగా ‘రౌడీ జనార్దన్’ మూవీ!
- దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం
- కీర్తి సురేష్, ఆంటోని తట్టిల్‌ల వివాహం డిసెంబర్ 12న జరిగింది
- విజయ్ దేవరకొండతో న్యూ బిగినింగ్స్ అంటూ కీర్తి పోస్ట్ వైరల్
టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విజయ్, కీర్తి జోడీగా ‘రౌడీ జనార్దన్’
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. ‘2025 సంచిక ఆలస్యంగా పూర్తి చేసుకున్నాను, ఈ అందమైన సంవత్సరాన్ని 20 స్లయిడ్‌లలో తీసుకురావడం అంత సులభం కాదు.. నోట్: 2026ని కృతజ్ఞతతో, ఉత్సాహంగా మరియు రాబోయే ప్రతిదానికీ సిద్ధంగా ఉన్న భావనతో ప్రారంభించడం’ అనే క్యాప్షన్ జోడించింది.
దిల్ రాజు నిర్మాణంలో మూవీ అప్డేట్స్
అయితే ఆమె షేర్ చేసిన ఫొటోలో విజయ్ దేవరకొండతో దిగిన ఫొటో షేర్ చేసి దానికి న్యూ బిగినింగ్స్ అనే క్యాప్షన్ జోడించడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సినిమా మంచి విజయం సాధించాలని బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా విజయ్-కీర్తి సురేశ్ జంటగా ‘రౌడీ జనార్దన్’ అనే మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి రవికిరణ్ కోల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు
A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)
కీర్తి సురేష్, విజయ్ దేవరకొండల కాంబో మూవీ అంటేనే ఒక రేంజ్ అంతే! ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు మీ ముందుకు తెస్తాం.

