|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పక్కా ప్లాన్‌తో స్క్రిప్టు రాస్తున్నాను: కీర్తి సురేష్‌

Published: 29-11-2025, 10:08 PM
పక్కా ప్లాన్‌తో స్క్రిప్టు రాస్తున్నాను: కీర్తి సురేష్‌

ప్రముఖ నటి కీర్తి సురేష్ దర్శకత్వంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ, స్క్రిప్టు రాస్తున్నట్లు తెలిపారు. ఆమె నటించిన ‘రివాల్వర్ రీటా’ విడుదల, వివాహ జీవితం, అలాగే ‘మహానటి’ ప్రయాణం, మహిళల భద్రత వంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Key Points

1

దర్శకురాలిగా మారాలనే ఆసక్తితో స్క్రిప్టు రాస్తున్నానని కీర్తి సురేష్ తెలిపారు.

2

ఆమె తాజా చిత్రం 'రివాల్వర్ రీటా' ఈనెల 28న విడుదల కానుంది.

4

'తొడరి'లో విమర్శల తర్వాత 'మహానటి' అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

దర్శకత్వంపై కీర్తి సురేష్ ఆసక్తి

ప్రస్తుతం దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో కీర్తి సురేష్‌( Keerthy Suresh) ఒకరు. మలయాళం చిత్ర పరిశ్రమలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథానాయకిగా ఎదిగి మలయాళం, తమిళం ,తెలుగు భాషల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఆ మధ్య మేరిజాన్‌ అనే చిత్రంతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈఅమ్మడు నటిగా పుష్కరకాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది వివాహ జీవితంలోకి కూడా అడుగు పెట్టారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం రివాల్వర్‌ రీటా ఈనెల 28న తెరపైకి రానుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. వివాహానంతరం తాను నటించిన రివాల్వర్‌ రీటా చిత్రం విడుదల కానుందని పేర్కొన్నారు.

‘రివాల్వర్ రీటా’, వివాహానంతర జీవితం

తన భర్తతో కలిసి నటిస్తారని చాలామంది అడుగుతున్నారని ఆయనతో నటించే ఆలోచన లేదని చెప్పారు. అసలు ఆయన సినిమా అంటేనే పారిపోతున్నారని అన్నారు. కాగా రివాల్వర్‌ రీటా చిత్రాన్ని ఆయన తనతో కలిసి చూశారని చెప్పారు. అప్పుడు ఇకపై ఇలా చిత్రాలను ప్రత్యేకంగా చూడనని, థియేటర్లోనే చూస్తానని చెప్పారన్నారు. ఇది కోలమావు కోకిల(కోకో కోకిల) చిత్రానికి సీక్వెల్‌ కాదని స్పష్టం చేశారు. తమిళ చిత్రం తొడరిలో తన నటన గురించి ఎగతాళి కూడా చేశారన్నారు. అయితే ఆ చిత్రం చూసిన తర్వాతే మహానటి చిత్రంలో తనను ఎంపిక చేశారని చెప్పారు. ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చిందన్నారు.

మహానటి విజయం, మహిళల భద్రత

ఒక ప్రమాదకరమైన వీడియోలో తాను సమంత కలిసి ఉన్నట్లు సృష్టించారన్నారు. దాన్ని చూసి తాను భయపడ్డాను అన్నారు.  విదేశాల్లో మహిళలకు కొంత వరకు రక్షణ ఉంటుందని, మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని, అందుకోసం చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని అందుకోసం స్క్రిప్టును రాస్తున్నట్లు కీర్తిసురేష్‌ చెప్పారు. జీవితంలో ఒక్క సినిమాకు అయినా సరే దర్శకత్వం వహించాలనే కోరిక ఉందన్నారు.

కీర్తి సురేష్‌ నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే, దర్శకత్వంపై తనకున్న కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన తాజా విశేషాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.