
రెండేళ్ల క్రితం విడుదలైన మలయాళం వెబ్ సిరీస్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ రెండో సీజన్ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Key Points
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ 'కేరళ క్రైమ్ ఫైల్స్' రెండో సీజన్ తెలుగు ట్రైలర్ విడుదలైంది.
జియోహాట్‌స్టార్ ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ ప్రారంభం.
హత్య, మిస్సింగ్ కేసు చుట్టూ కథనం తిరుగుతుంది.
కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ ట్రైలర్ విడుదల
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రెండేళ్ల కిందట వచ్చిన మలయాళం వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్. మలయాళంలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గురువారం (మే 29) తెలుగులోనూ రానున్న ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సీపీవో అంబిలి రాజు కోసం జరగబోయే అన్వేషణ అంటూ ఈ కొత్త సీజన్ ను పరిచయం చేశారు.
కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ ట్రైలర్ 1 నిమిషం 53 సెకన్ల పాటు ఉంది. ఓ హత్య, మిస్సింగ్ కేసు చట్టూ ఈ కొత్త సీజన్ తిరగనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ కేసులో కొందరు పోలీస్ ఆఫీసర్లే అనుమానితులు అన్నట్లుగా ట్రైలర్ మొదట్లోనే కొందరిని సస్పెండ్ చేసినట్లు చూపించారు. అజు వర్గీస్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇది.
ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన కేస్ అంటూ ఈ ట్రైలర్ ను మరింత ఆసక్తికరంగా మార్చారు. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ తేదీని వెల్లడించకపోయినా.. త్వరలోనే అని మాత్రం చెప్పింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్
అహ్మద్ ఖబీర్ ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. ఇందులో అర్జున్ రాధాకృష్ణన్, అజు వర్గీస్, లాల్, ఇంద్రన్స్, హరిశ్రీ అశోకన్, జియో బేబీ, నూరిన్ షరీఫ్, షిబ్లా ఫరా లాంటి వాళ్లు నటించారు.
తొలి సీజన్ తో పోలిస్తే ఈ రెండో సీజన్లో కొన్ని పాత్రలు మారిపోయాయి. కొందరు కొత్తగా వచ్చి చేరారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ కొత్త సీజన్ కు మ్యూజిక అందిస్తున్నాడు.
కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ తొలి సీజన్ జూన్, 2023లో రిలీజైంది. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన సీఐడీ సిరీస్ కు దగ్గరగా ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ సాగుతుంది. చిన్న క్లూ కూడా లేని ఓ మర్డర్ కేసును కొందరు పోలీసులు పట్టుదలగా ఆరు రోజుల్లోనే ఎలా సాల్వ్ చేశారన్నది ఆరు ఎపిసోడ్స్ ద్వారా ఈ సిరీస్‌లో చూపించారు డైరెక్టర్ అహ్మద్ ఖబీర్.
నటీనటులు మరియు కథాంశం
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు ఊహించని మలుపులతో ఫాస్ట్‌ఫేజ్‌లో సాగుతుంటాయి. హీరో తన తేలివితేటల్ని ఉపయోగించి క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడన్నది చూపిస్తుంటారు. కానీ కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది.
ఓ మర్డర్ కేసును పోలీసులు నిజంగా ఎలా ఇన్వేస్టిగేట్ చేస్తారు? ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లను చాలా సహజంగా స్క్రీన్‌పై చూపించారు డైరెక్టర్. సిరీస్ చూస్తున్నట్లుగా కాకుండా పోలీస్ జీవితాల్ని, వారి వృత్తిని వాస్తవికంగా కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఫీలింగ్ కలుగుతుంది.
మొత్తంమీద, కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ ఆసక్తికరంగా ఉండబోతుందని ట్రైలర్ సూచిస్తోంది. జియోహాట్‌స్టార్‌లో త్వరలోనే ఈ సిరీస్‌ను చూడొచ్చు.


