
కేరళలోని వెళ్ళమశ్శరీ గరుడన్ కావు అనే అరుదైన గరుడ ఆలయం గురించి ఈ కథనం వివరిస్తుంది. ఈ ఆలయం భారతదేశంలో గరుత్మంతునికి అంకితమైన ఏకైక ఆలయం అని చెప్పబడుతుంది. కథనంలో ఆలయ చరిత్ర, కందదుంపల సమర్పణ వంటి విషయాలు వివరించబడ్డాయి.
Key Points
కేరళలోని అరుదైన గరుడ ఆలయం గురించి తెలుసుకోండి.
గరుత్మంతునికి ప్రత్యేకంగా నిర్మించబడిన ఏకైక ఆలయం ఇది.
ఆలయ చరిత్రలోని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోండి.
ఈ ఆలయంలో కందదుంపలను ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం.
గరుడన్ కావు ఆలయ చరిత్ర
కేరళలో అరుదైన దేవాలయాలు ఎన్నో నివసిస్తాయి. అలాంటి ప్రత్యేక ఆలయాల కోవలోనిదే ‘వెళ్ళమశ్శరీ గరుడన్ కావు’. శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి (గద), ఆదిశేషువు, గరుత్మంతుడు ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి. శంఖం, గద శ్రీహరి హస్తభూషణాలుగా ప్రసిద్ధి. వీరిని ‘నిత్య సూరి’ అని పిలుస్తారు. స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉంది.
సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ధి గరుత్మంతుడు. ప్రతీ విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతాసుతుని మనందరం చూస్తూనే ఉంటాం. కానీ అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం గరుడన్ కావులో కనిపిస్తుంది. భారతదేశంలో పక్షిరాజుకు ఉన్న ఆలయం ఇదొక్కటేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఎన్నో యుగాలకు పూర్వం, ఒక మహామునికి మానవ జీవిత అర్థం, పరమార్థం గురించి స్వయంగా వైకుంఠనాథుడే తెలిపే సమయంలో వాహనమైన గరుడుడు పక్కనే ఉన్న కోనేరు వద్ద వేచి ఉన్నాడట. అలా పరమాత్మ సంచరించిన స్థలంగా ప్రసిద్ధికెక్కిన ఆ ప్రదేశంలో కొన్ని కుటుంబాలు శ్రీ జగన్నాథుని ఆలయం నిర్మించుకొని ఆరాధించేవి. ఆ కాలంలో పేరొందిన శిల్పి ‘పేరున్ థాచన్’ (కేరళలోని ప్రముఖ ఆలయాల నిర్మాణాల వెనుక ఉన్నది ఈయనే అన్న విశ్వాసం) స్థానిక వేట్టాతునాడు పాలకుని వద్దకు వచ్చాడట అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మహా శిల్పిని సాదరంగా ఆహ్వానించిన రాజు, ఆయన చేతిలో సహజత్వాన్ని కలిగి ఉన్న గరుడ బొమ్మను చూసి శిల్పి నేర్పరితనాన్ని కొనియాడారు. దానికి ‘పేరున్ థాచన్’ “పతివ్రత అయిన స్త్రీ గనుక తాకితే ప్రాణం పోసుకొని ఎగురుతుంది” అని సమాధానం ఇచ్చారట. అంతఃపుర స్త్రీలు కావాలంటే పరీక్షించుకోవచ్చు అని కూడా అన్నారట అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆ మాటకు ఆగ్రహించిన రాజు, శిల్పి భార్యను రప్పించి తాకించారట. ఆమె చేతి స్పర్శ తగలగానే ఆ చెక్క గరుడ శిల్పం ప్రాణం పోసుకొని గాలిలోకి ఎగిరినదట. ఆశ్చర్యపోయిన రాజు శిల్పిని క్షమాపణ కోరారు. గరుడ పక్షి వెళ్లిన మార్గంలో వెదకడానికి భటులను పంపారట. వెంటాడిన భటులు సమీపంలోని కోనేరులో తెల్ల తాబేళ్ల మీద వాలి ఉన్న పక్షిని కనుగొన్నారట. తరలి వచ్చిన రాజు ఈ క్షేత్రం ప్రాముఖ్యత తెలుసుకొని శిల్పాచార్యుని చేతనే ఇక్కడ ఒక నూతన ఆలయం, శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతునికి కట్టించారట. ఆనతి కాలంలోనే విశేష ప్రాముఖ్యత పొందిన ఆలయంగా పేరు గాంచింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పేరున్ థాచన్ శిల్పకళ
తదనంతర కాలంలో మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్, కేరళ ప్రాంతం మీద జరిపిన దాడుల్లో తొలుత ‘పేరున్ థాచన్’ చేత నిర్మించబడిన ఆలయం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. మూల విరాట్టులు సుమారు 1800 సంవత్సరాలుగా పూజలందుకుంటున్నా, ప్రస్తుత ఆలయం మాత్రం రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ప్రశాంత వాతావరణంలో గుబురుగా పెరిగిన వృక్షాల మధ్య తూర్పు, పడమర ద్వారాలు కలిగిన ఈ ఆలయం ఉంటుంది.
పురుషులు తప్పనిసరిగా ధోతి ధరించాలి. ధ్వజస్తంభం, బలిపీఠాలు లేని ప్రాంగణంలో ఒక పక్క అంబల కార్యాలయం, మరో పక్క ప్రసాద విక్రయశాల ఉంటాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ, వినుతల మధ్య సహజంగా సవతుల మధ్య ఉండే స్పర్ధ ఉండేది. కద్రువ చేసిన మోసానికి వినుత, ఆమెకు దాసిగా ఉండవలసి వచ్చింది. కద్రువ సంతానం నాగులు. వినుత సంతానంలో ఒకరు శ్రీ సూర్యనారాయణుని రథ సారథి అయిన ‘అనూరుడు’. రెండవ, అమిత పరాక్రమశాలి అయిన ‘గరుత్మంతుడు’. తల్లికీ తనకీ దాస్య విముక్తికి సవతి తల్లి కోరినట్లుగా, దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చినవాడు గరుత్మంతుడు.
గరుడునికి నాగులతో ఉన్న శత్రుత్వం
దేవేంద్రుని సలహా మేరకు నాగులకు అమృతం అందకుండానే దాస్య విముక్తి పొంది, శ్రీ వైకుంఠవాసుని వాహనంగా శాశ్వత వైకుంఠ నివాస స్వామి సేవా భాగ్యం అందుకున్నాడు. అలా గరుడునికి నాగులతో ఉన్న శత్రుత్వం అంతులేనిది. నాగ సర్పదోషం, సర్ప శాపం వల్ల వివాహం కానివారు, సంతానం లేనివారు, అనారోగ్య పీడితులు ఈ ఆలయానికి వస్తుంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కందదుంపల సమర్పణ
భక్తులు ముఖ్యంగా అనారోగ్య పీడితులు, సర్ప దోషం లేదా కుజ దోషం ఉన్నవారు ఎక్కువగా వస్తుంటారు. రాహు /కుజ దోషం ఉన్నవారు ఇక్కడ నాగ ప్రతిష్ట జరిపిస్తారు. ప్రాంగణమంతా ఎన్నో నాగ శిలలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. నాగ దోషం ఉన్న భక్తులు కొందరు జ్యోతిష్యుల సలహా మేరకు నాగ పంచమి లేదా నాగ చవితి లాంటి ప్రత్యేక రోజులలో బతికి ఉన్న సర్పాన్ని మట్టి కుండలో బంధించి తెచ్చి, మూలవిరాట్టు ముందు కుండను పగలకొడతారు. బుసలు కొడుతూ బయటికి వచ్చిన పామును ఆలయ పూజారి గరుడ పంచాక్షరి మంత్రంతో శాంతింపచేస్తారట.
శాంతించిన పాము ఆలయ బయటికి వెళ్లిపోతుందట. ఇలా చేయడం ద్వారా వంశానికి తరతరాల నుండి వస్తున్న సర్పదోషం తొలగిపోయిందని అంటారు. తిరిగి ఆ వంశంలో ఎవరూ నాగదోష పీడితులు కారని నమ్ముతారు. కేరళ రాష్ట్రంలో మన్నార్ శాలలో ప్రసిద్ధ నాగరాజ స్వామి ఆలయం ఉంది. అక్కడ కూడా ఇలా సర్పాన్ని తెచ్చి గరుడ మంత్రంతో బంధించే ప్రక్రియ చేస్తారు. గరుడుని మహత్యమో, మరొకటో.. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరూ పాము కాటుకు గురి కాలేదని తెలుస్తోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చర్మవ్యాధులు ఉన్నవారు దుంపకూరలు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కానీ ఇక్కడ అదే కంద దుంప వ్యాధిని తగ్గించడం ఒక విశేషంగా పేర్కొంటారు. దీర్ఘకాలం చర్మవ్యాధులతో బాధపడేవారు మూడు ఆదివారాలు వచ్చి స్వామిని ఆరాధిస్తే సమస్త చర్మ, శ్వాసకోశ వ్యాధులు తొలగిపోతాయని తరతరాల నమ్మకం. ఆర్చన, పూల అలంకరణ, అభిషేకం లాంటి వాటికంటే కంద దుంప సమర్పణ చికిత్స ప్రత్యేకంగా ఉంటుంది.
వ్యాధిగ్రస్తులు ఒక కంద దుంపను, ఒక లోహ నాగ రూపాన్ని తీసుకొని అర్చకస్వామి సూచనల ప్రకారం ప్రార్థిస్తారు. ఆ సమయంలో అర్చకులు మంత్రం పఠనం చేస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000
కేరళలోని గరుడన్ కావు ఆలయం, దాని ప్రత్యేకత, చరిత్ర మరియు కందదుంపల సమర్పణ వల్ల ఈ ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. భారతీయ సంస్కృతిలో ఆలయాల ప్రాముఖ్యతను ఈ ఆలయం మరోసారి చాటుతుంది.

