|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఖలేజా: అప్పుడేమో డిజాస్టర్‌.. ఇప్పుడేమో రికార్డులు తిరగరాస్తోంది!

Published: 02-06-2025, 5:56 AM
ఖలేజా: అప్పుడేమో డిజాస్టర్‌.. ఇప్పుడేమో రికార్డులు తిరగరాస్తోంది!

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ఇప్పుడు 4K వెర్షన్‌లో రీరిలీజ్ అయ్యి అనూహ్య విజయం సాధించింది. మూడు రోజుల్లోనే కోట్లలో వసూళ్లు సాధించింది.

Key Points

1

ఖలేజా సినిమా రీ-రిలీజ్‌లో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.

2

మూడు రోజుల్లోనే రూ. 11.83 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

4

కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఈ రీ-రిలీజ్ జరిగింది.

ఖలేజా రీ-రిలీజ్‌ విజయం

‘ఖలేజా’ సినిమా ( Khaleja Movie )తో నిండా మునిగాడు నిర్మాత సింగనమల రమేశ్‌. కొమురం పులి, ఖలేజా సినిమాలతో ఏకంగా రూ.100 కోట్లు నష్టపోయానని ఆ మధ్య తన బాధను వ్యక్తం చేశాడు. మహేశ్‌బాబు ( Mahesh Babu ) హీరోగా నటించిన ఖలేజా సినిమా షూటింగ్‌ జాప్యం ఒక కారణమైతే ప్రేక్షకులు దాన్ని డిజాస్టర్‌గా మల్చడం మరో కారణం. కానీ ఆ సినిమా ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తుండటం విశేషం!

అప్పుడలా.. ఇప్పుడిలా.. 2010లో త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఖలేజా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. కానీ తర్వాత టీవీల్లో మాత్రం జనాలు బాగానే చూసేవారు. అసలే కొంతకాలంగా రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. బిజినెస్‌మ్యాన్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పోకిరి, ఒక్కడు.. ఇలా మహేశ్‌ సినిమాలే చాలావరకు రీరిలీజ్‌ అయ్యాయి. తాజాగా మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఖలేజాను 4కె వర్షన్‌లో రీరిలీజ్‌ చేశారు.

అద్భుతమైన కలెక్షన్స్

నీ వల్ల అవుద్ది సామి ఇంకేముంది, మరోసారి జనం థియేటర్లకు క్యూ కట్టారు. కొత్త సినిమాలను సైతం పక్కకు నెట్టి ఖలేజా సినిమాను వీక్షిస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.11.83 కోట్లు రాబట్టినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రీరిలీజ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తెలుగు చిత్రంగా ఖలేజా నిలిచింది. ఇది చూసిన అభిమానులు.. ఈ రికార్డులన్నీ కేవలం నీ వల్లే అవుతాయి సామి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

త్వరలోనే మరో రీరిలీజ్‌ ఖలేజా సినిమాలో మహేశ్‌బాబుకు జంటగా హీరోయిన్‌ అనుష్క నటించింది. ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌, సునీల్‌, షఫీ, అలీ, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించాడు. అతడు తర్వాత త్రివిక్రమ్‌- మహేశ్‌ డైరెక్షన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌, ఉత్తమ గేయరచయిత విభాగంలో రెండు ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డులు అందుకుంది. ఇకపోతే మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న అతడు చిత్రాన్ని మళ్లీ రిలీజ్‌ చేయనున్నారు.

మహేశ్ బాబు మ్యాజిక్

చివరగా, ఖలేజా సినిమా రీ-రిలీజ్ ద్వారా అనూహ్య విజయం సాధించడం సంతోషదాయకం. మహేశ్ బాబు అభిమానులకు ఇది మరో గొప్ప వినోదం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.