
కల్ట్ క్లాసిక్‌గా పేరొందిన మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ ఖలేజా సినిమా మే 30న మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
Key Points
మే 30న ఖలేజా సినిమా రీ-రిలీజ్.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మళ్ళీ ప్రేక్షకుల ముందు.
నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ ట్వీట్.
కల్ట్ క్లాసిక్ ఖలేజా మళ్ళీ బిగ్ స్క్రీన్‌పై.
ఖలేజా రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చి కమర్షియల్‌గా విజయం సాధించకున్నా కల్ట్ క్లాసిక్‌గా పేరు దక్కించుకున్న చిత్రం ఖలేజా (Khaleja). పదిహేనేండ్ల తర్వాత తిరిగి ఈ మూవీని మేకర్స్ థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఈ నేథ్యంలో తాజాగా శుక్రవారం ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. మే30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.
‘త్రివిక్రమ్ గారు అత్యంత చురుకైన రచన x సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అద్భుతమైన కామిక్ టైమింగ్ స్వచ్ఛమైన బంగారు చిత్రాలను అందించిన కాంబో..కాలానికి ఎంతో ముందున్న సినిమా, ఈ మే 30న బిగ్ స్క్రీన్‌పై మళ్ళీ మాజికల్ కల్ట్ క్లాసిక్ ఖలేజాను అనుభవించండి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి థియేటర్లలో రీరిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తోందో చూడాల్సి ఉంది.
నిర్మాత నాగవంశీ ట్వీట్ వైరల్
మహేష్ బాబు-త్రివిక్రమ్ మ్యాజిక్ మళ్ళీ
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమా రీ-రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. నిర్మాత నాగవంశీ ట్వీట్ సినిమాపై ఆసక్తిని పెంచింది.


