
టాలీవుడ్ నటి కియారా అద్వానీ తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె ప్రెగ్నెన్సీ గ్లో గురించి కామెంట్ చేస్తున్నారు.
Key Points
కియారా అద్వానీ తన భర్తతో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నెటిజన్లు ప్రెగ్నెన్సీ గ్లో గురించి కామెంట్ చేస్తున్నారు.
కియారా తల్లి కాబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించింది.
కియారా అద్వానీ తాజా ఫోటోలు
‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర(Sidharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటూ 2023లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
నెటిజన్ల ప్రతిచర్యలు
అయితే ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్న విషయాన్ని రీసెంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా కియారా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఎక్కడో వేకెషన్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని ఫుడ్, ఫ్రూట్ ఐటమ్స్ ఉన్న పిక్స్‌తో పాటు తన భర్తతో దిగిన, తను సెల్ఫీలు తీసుకున్న పిక్స్‌ను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కియారా అమ్మ కాబోతుందంటే నమ్మలేకపోతున్నామని, ప్రెగ్నెన్సీ గ్లో ఇట్టే కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
కియారా అద్వానీ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రెగ్నెన్సీ గ్లో గురించిన కామెంట్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి.


