
📌 Key Points
- జ్యోతి పూర్వాజ్ నటించిన ‘కిల్లర్’ మూవీ టీజర్ ఫిబ్రవరి 22న విడుదల!
- ఈ చిత్రంలో జ్యోతి పూర్వాజ్ ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు: స్పై, వాంపైర్, సూపర్ షీ…
- డైరెక్టర్ పూర్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
- ‘కిల్లర్’ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నాయని పోస్టర్‌తోనే అంచనాలు!
జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా టీజర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలతో తెరకెక్కుతోంది. విడుదలైన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
‘కిల్లర్’గా జ్యోతి పూర్వాజ్ సంచలనం
‘గుప్పెడంత మనసు’ జగతి మేడమ్‌గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జ్యోతి పూర్వాజ్(Jyothi Purvaj).. ఇప్పుడు ‘కిల్లర్’ సినిమాతో వెండితెరపై కనిపించనుంది. వెండితెరపై ఒక పవర్‌ఫుల్ యాక్షన్ హీరోయిన్‌గా జ్యోతి పూర్వాజ్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘కిల్లర్’(Killer) . ఇది కేవలం సాధారణ యాక్షన్ సినిమా కాదు.. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్ కలిసిన ఒక భారీ ‘సై-ఫై’ థ్రిల్లర్. ఈ సినిమా గురించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జ్యోతి పూర్వాజ్ ఇందులో ఒకటో రెండో కాదు, ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపిస్తోంది. స్పై (గూఢచారి), వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై అనే ఐదు పాత్రలతో ఆమె ప్రేక్షకులను షాక్‌కు గురి చేయబోతోందని టాక్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆమెను ఒక పవర్‌ఫుల్ రోబోగా చూపించి డైరెక్టర్ పూర్వాజ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘ఆత్మ కలిగిన యంత్రం’’ అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా, టీజర్ ఫిబ్రవరి 22న రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక విడుదలైన పోస్టర్‌లో ఒక స్టేడియంలో మంటలు వస్తుండగా, వింతైన ఆకారం పైకి ఎగసి ఉండటం చూస్తుంటే.. ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ప్రాచీన వైమానిక శాస్త్రంలోని రహస్యాలను, ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపెడుతూ ఈ కథను రూపొందించినట్లు సమాచారం. విడుదలైన పోస్టర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రానికి జ్యోతి పూర్వాజ్ భర్త, టాలెంటెడ్ డైరెక్టర్ పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆయన హీరోగా కూడా నటిస్తుండటం విశేషం. ‘థింక్ సినిమా’ బ్యానర్‌పై పద్మా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడలోనూ విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ‘కిల్లర్’.. త్వరలోనే థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది.
ఫిబ్రవరి 22న టీజర్ విడుదల
ఐదు విభిన్న పాత్రల్లో అదరగొట్టనున్న జ్యోతి
‘కిల్లర్’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


