|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్ నాగార్జున ఎమోషనల్ పోస్ట్.. మే 23కి ఆ హిస్టరీ ఏంటో తెలుసా?

Published: 23-05-2026, 5:15 AM
కింగ్ నాగార్జున ఎమోషనల్ పోస్ట్.. మే 23కి ఆ హిస్టరీ ఏంటో తెలుసా?
  • నాగార్జున మొదటి చిత్రం ‘విక్రమ్’ 1986 మే 23న విడుదలై 40 ఏళ్లు పూర్తి.
  • దిగ్గజ ANR చివరి చిత్రం ‘మనం’ కూడా మే 23నే విడుదల కావడం విశేషం.
  • మూడు తరాల అక్కినేని హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించిన అరుదైన సందర్భం.
  • 40 ఏళ్లుగా అభిమానులు అందించిన ప్రేమ, ఆదరణకు నాగార్జున కృతజ్ఞతలు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున జీవితంలో మే 23 ఒక ప్రత్యేకమైన రోజు. ఈ తేదీతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. తన సినీ ప్రయాణంలో ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ, అభిమానులను ఉద్దేశించి నాగార్జున చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో ఏముందో తెలుసుకుందామా?

మే 23.. నాగార్జున జీవితంలో ఒక మధుర జ్ఞాపకం!

తన జీవితంలో మే 23 ఎప్పటికీ ప్రత్యేకమైనది అంటూ ఎమోనల్ ట్వీట్ షేర్ చేశాడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున. తన మొదటి అడుగు ‘విక్రమ్’ చిత్రం 1986 మే 23 న రిలీజ్ కాగా.. నేటితో 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులకు ధన్యవాదాలు తెలుపారు. ‘ఈ రోజు నాపై కురిపిస్తున్న ఆశీర్వాదాలకు, ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. మే 23!! నేను ఎప్పటికీ మరువలేని తేదీ ఇది!! నా దిగ్గజ తండ్రి ANR గారి చివరి చిత్రం ‘మనం’ను నిర్మించి విడుదల చేసే అరుదైన గౌరవం నాకు దక్కిన రోజు ఇది. నా తండ్రితోనూ, నా కుమారులతోనూ కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించిన చిత్రం అది. ఎన్నో ఏళ్ల క్రితం, ఇదే మే 23 తేదీన నా మొదటి చిత్రం ‘విక్రమ్’ను విడుదల చేసే అవకాశం కూడా నాకు లభించింది. మీ అందరినీ అలరించే, మీ ఆశీర్వాదాలను, ప్రేమను పొందే అదృష్టం నాకు దక్కిన రోజు అది. ఇన్ని ఏళ్లుగా నా వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరిన్ని ‘మే 23’లు నా జీవితంలో రావాలని ఆశిస్తున్నాను’ అంటూ తెలిపారు. కాగా.. నాగార్జున హీరోగా ముధుసుధనరావు తెరకెక్కించిన ‘విక్రమ్’ చిత్రం 1986 మే 23న విడుదలై విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కింగ్ తన కెరీర్‌లో మైలురాయి అయినా 100 వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కాగా.. 1986లో ఇదే రోజున ‘విక్రమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ్, తర్వాత అదే తేదీన వచ్చిన ‘మనం’ మూవీతో అక్కినేని కుటుంబం 3 జనరేషన్స్‌ని ఒకే స్క్రీన్‌పై చూపించారు. ANR గారి చివరి సినిమా కూడా ఇదే కావడం ఈ రోజును మరింత ఎమోషనల్‌గా మార్చింది.

‘విక్రమ్’ నుండి ‘మనం’ వరకు.. కింగ్ జర్నీ!

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన నాగ్!

మే 23 తేదీతో కింగ్ నాగార్జునకున్న అనుబంధం నిజంగా అద్భుతం. 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన ఈ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్‌ కోసం మా పేజీని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.