|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్డమ్ కలెక్షన్స్: ‘కింగ్డమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరీర్ హైయెస్ట్..?

Published: 01-08-2025, 12:18 AM
కింగ్డమ్ కలెక్షన్స్: ‘కింగ్డమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరీర్ హైయెస్ట్..?

జులై 31న విడుదలైన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇది విజయ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ కావచ్చు.

Key Points

1

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా మొదటి రోజు 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

2

తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

4

ఈ వీకెండ్ లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటే అవకాశం ఉంది.

కింగ్డమ్ మొదటి రోజు కలెక్షన్స్

Kingdom Collections : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నిన్న జులై 31న థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముందు నుంచి ఈ సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయని అంటున్నారు. ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. నిన్న నిర్మాత మాట్లాడుతూ చాలా చోట్ల 50 శాతం ఓపెనింగ్స్ వచ్చాయి అని తెలిపారు.

బాక్సాఫీస్ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ సినిమా మొదటి రోజు దాదాపు 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని సమాచారం. అంటే ఆల్మోస్ట్ 15 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగు స్టేట్స్ లోనే మొదటి రోజు ఆల్మోస్ట్ 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. అమెరికాలో అయితే ఆల్రెడీ 1.1 మిలియన్ డాలర్స్ గ్రాస్ వచ్చేసినట్టు అధికారికంగానే ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల రూపాయలకు పైగా అమెరికా నుంచి కలెక్షన్స్ మొదటి రోజే వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్

అమెరికాలో కింగ్డమ్ ప్రభావం

అధికారికంగా మూవీ యూనిట్ నుంచి కలెక్షన్స్ పై ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ గత సినిమాల్లో లైగర్ కి ఉన్న హైప్ తో ఓపెనింగ్ రోజు 23 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత ఖుషి సినిమాకు 16 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు విజయ్ తన రికార్డులను బద్దలు కొట్టి కింగ్డమ్ సినిమాతో 30 కోట్ల ఓపెనింగ్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ మూడు రోజుల్లో ఈజీగా 100 కోట్ల గ్రాస్ దాటేస్తాడని భావిస్తున్నారు.

మొత్తానికి, కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. ఈ వీకెండ్ కలెక్షన్స్ సినిమా విజయానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.