|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘కింగ్డమ్‌’.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

Published: 02-08-2025, 4:51 AM
బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘కింగ్డమ్‌’.. రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని చేసింది. రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.

Key Points

1

కింగ్డమ్ సినిమా రెండు రోజుల్లో రూ. 53 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

2

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 14.03 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.

4

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

కింగ్డమ్‌ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్ ‌ బాక్సాఫీస్ ‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది . గౌతమ్ ‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ‌ ని సంపాదించుకుంది . దీంతో తొలి రోజు రూ . 39 కోట్ల గ్రాస్ ‌ వసూళ్లను రాబట్టింది . ఇక రెండు రోజుల్లోనే రూ . 50 కోట్ల క్లబ్ ‌ లోకి చేసింది . సినిమాకు హిట్ ‌ టాక్ ‌ రావడంతో రెండో రూ . 14 కోట్ల వసూళ్లు వచ్చాయి .

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విశ్లేషణ

మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ . 53 కోట్ల గ్రాస్ ‌ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ‌ అధికారికంగా ప్రకటించారు . రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్‌ వచ్చాయి.

వీకెండ్ లో కలెక్షన్స్ పెరుగుదల అంచనాలు

నైజాంలో రూ . 1.85 కోట్లు , సీడెడ్ ‌ లో రూ . 79 లక్షలు , ఉత్తరాంధ్రలో రూ . 48 లక్షలు , గుంటూరులో రూ .21 లక్షలు , కృష్ణాలో రూ . 21 లక్షలు , ఈస్ట్ ‌ లో రూ . 26, వెస్ట్ ‌ గోదావరిలో రూ . 18 లక్షలు , నెల్లూరులో రూ . 13 లక్షల షేర్ ‌ వసూళ్లను సాధించింది . మొత్తంగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ . 14.03 కోట్ల షేర్ ‌ వసూళ్లను రాబట్టింది . సినిమాకు మంచి టాక్ ‌ రావడంతో వీకెండ్ ‌ లో ఈ కలెక్షన్స్ ‌ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ ‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి .

మొత్తంగా, కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. వీకెండ్ కలెక్షన్స్‌తో మరింత విజయం సాధించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.