|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అయిదో రోజు రూ.2.25 కోట్లే.. దారుణంగా పడిపోయిన కింగ్డమ్ కలెక్షన్లు.. విజయ్ దేవరకొండకు కష్టమే.. లాభాల్లోకి వచ్చేనా?

Published: 05-08-2025, 12:41 AM
అయిదో రోజు రూ.2.25 కోట్లే.. దారుణంగా పడిపోయిన కింగ్డమ్ కలెక్షన్లు.. విజయ్ దేవరకొండకు కష్టమే.. లాభాల్లోకి వచ్చేనా?

భారీ అంచనాలతో విడుదలైన కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరుస్తుంది. ఐదవ రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. విజయ్ దేవరకొండకు లాభాలు సాధించడం సవాలుగా మారింది.

Key Points

1

కింగ్డమ్ సినిమా 5వ రోజు కేవలం రూ. 2.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

2

మూవీ రిలీజ్ తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి.

4

బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరడానికి ఇంకా రూ.13 కోట్లు అవసరం.

కింగ్డమ్ కలెక్షన్లలో భారీ క్షీణత

భారీ అంచనాలతో స్పై థ్రిల్లర్ గా థియేటర్లలోకి వచ్చిన కింగ్డమ్ మూవీకి కష్టాలు తప్పడం లేదు. మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. విజయ్ దేవరకొండ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా కష్టపడక తప్పదు. కానీ ఆ దిశగా మెరుగైన సంకేతాలు కనబడటం లేదు. కింగ్డమ్ సినిమా జులై 31న రిలీజైంది. విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు. మరి అయిదు రోజుల్లో ఈ మూవీ ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టిందో చూద్దాం.

విజయ్ దేవరకొండ , సత్యదేవ్, వెంకటేష్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా కింగ్డమ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజైన తర్వాత మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత షాక్ తప్పడం లేదు. సక్నిల్క్ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం 5వ రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. సోమవారం (ఆగస్టు 4) రూ. 2.25 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది.

విజయ్ దేవరకొండకు లాభాలు దూరంగా?

కింగ్డమ్ సినిమా రిలీజైనప్పటి నుంచి ఓ రోజు వసూళ్లలో అత్యల్పంగా అంటే సోమవారం వచ్చాయి. మండే పరీక్షను విజయ్ దేవరకొండ గట్టెక్కలేకపోయాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలిరోజు అంటే గురువారం రూ.18 కోట్లు రాబట్టింది. వీకెండ్ రన్ లో శని, ఆదివారాల్లో వరుసగా రూ.7.5 కోట్లు, రూ.8 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం నెట్ వసూళ్లు రూ.43.15 కోట్లకు చేరాయి.

కింగ్డమ్ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ దగ్గర తన పరుగును కొనసాగించాల్సి ఉంటుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రూ.56 కోట్ల నెట్, రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్లుగా ట్రేడ్ పండితులు లెక్కకట్టారు. దీని ప్రకారం చూసుకుంటే కింగ్డమ్ ఇంకా రూ.13 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించే అవకాశాలు?

గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ , భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటించారు. ఇది ఒక పోలీసు కానిస్టేబుల్ సూరి (విజయ్) కథ. అతను చాలాకాలం కిందట మిస్ అయిన తన సోదరుడు శివ (సత్యదేవ్) ను కనుగొనాలనే ఆశతో శ్రీలంకలోని ఒక కార్టెల్ను కూల్చడానికి రహస్యంగా వెళ్ళడానికి అంగీకరిస్తాడు. అక్కడ ఉన్నప్పుడు, అతను కార్టెల్ అధిపతి మురుగన్ (వెంకటేష్) తో తలపడతాడు. అక్కడ ఊహించని సంఘటనలు జరుగుతాయి. డాక్టర్ మధు (భాగ్యశ్రీ) కూడా సూరికి సహాయం చేసే అండర్ కవర్ ఆపరేటర్. సీక్వెల్ కోసం కథను సెట్ చేయడంతో సినిమా ముగుస్తుంది.

కింగ్డమ్ సినిమా లాభాలను అందుకోవాలంటే, బాక్స్ ఆఫీస్ వద్ద మరింత బలమైన పరుగు అవసరం. ప్రస్తుత పరిస్థితి చూస్తే, లాభాలను సాధించడం కష్టమే అనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.