|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్డమ్ రివ్యూ.. అన్నకోసం తమ్ముడు చేసిన యుద్ధం.. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మూవీ ఎలా ఉందంటే?

Published: 31-07-2025, 10:42 AM
కింగ్డమ్ రివ్యూ.. అన్నకోసం తమ్ముడు చేసిన యుద్ధం.. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మూవీ ఎలా ఉందంటే?

విజయ్ దేవరకొండ మరియు సత్యదేవ్ నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది. అన్నకోసం తమ్ముడు చేసే యుద్ధం చుట్టూ తిరిగే ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది.

Key Points

1

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కాంబినేషన్‌లో సూపర్బ్ యాక్షన్ సీన్స్.

2

అన్నదమ్ముల మధ్య ఎమోషనల్ డ్రామా బాగుంది.

4

క్లైమాక్స్ ఊహించని మలుపులతో ఆసక్తికరంగా ఉంటుంది.

కథాంశం మరియు నటన

నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అయ్యప్ప పి శర్మ, గోపరాజు రమణ తదితరులు

దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్ ఐఎస్సీ, గిరీష్ గంగాధరన్ ఐఎస్సీ

నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

విడుదల తేది జూలై 31, 2025

దర్శకత్వం మరియు సాంకేతిక విభాగం

పలు సినిమాల ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా కింగ్డమ్. మళ్లీ రావా, జెర్సీ వంటి చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాను తెరకెక్కించాడు. దీంతో భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలో కింగ్డమ్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కింగ్డమ్ రివ్యూ లో తెలుసుకుందాం.

సూరి (విజయ్ దేవరకొండ) తెలివితేటలు ఉన్న పోలీస్ కానిస్టేబుల్. చినప్పుడు తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోయిన అన్నయ్య శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు సూరి. ఈ క్రమంలో పై అధికారులు సూరికి ఓ సీక్రెట్ మిషన్ అప్పజెపుతారు. శ్రీలంకలోని ఓ దివిలో శివ ఓ తెగకు లీడర్‌ అని, అతన్ని ఇండియాకు తమ్ముడైనా సూరి తీసుకురావాలనేదే సీక్రెట్ మిషన్.

అన్న కోసం శ్రీలంకలో సూరి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? శివ అక్కడికి ఎందుకు పారిపోయాడు? ఆ తెగ ఏంటీ? దాన్ని ఎవరు పాలిస్తున్నారు? చివరికి అన్న శివను తమ్ముడు సూరి ఇండియాకు తీసుకొచ్చాడా? అనే విషయాలతో సాగే కథనమే కింగ్డమ్ .

కింగ్డమ్ సినిమా ఒక అన్నదమ్ముల మధ్య జరిగే ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎమోషనల్ సీన్స్ పండించడంలో దిట్ట అని ఆయన మునుపటి సినిమాలు చూస్తే చెప్పొచ్చు. అయితే, అలాంటి భావోద్వేగమైన సీన్స్ కింగ్డమ్‌లో అంతగా పండలేదు.

1920 బ్యాక్‌డ్రాప్‌తో కథ స్టార్ట్ అవడం, అన్న కోసం సూరి ప్రయత్నాలు చేయడం, తర్వాత అన్న ఆచూకీ, సీక్రెట్ స్పై ఏజెంట్ అని శ్రీలంక వెళ్లడం వేగంగానే సాగుతుంది. కానీ, చూసిన సినిమాల కాస్తా రొటీన్ ఫీల్ అవుతాం. అయితే, ఒక్కడక్కడ కొన్ని సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

చివరి మాట

విజయ్ దేవరకొండ ను చూపించిన తీరు బాగుంది. శ్రీలంకలో సూరి అడుగుపెట్టిన తర్వాత వచ్చే డ్రామా పర్లేదు. అయితే, సూరి, శివ అన్నదమ్ములు అనే విషయం ఎలా తెలుస్తుందనే ఇంట్రెస్ట్, నాటకీయతను పెద్దగా చూపించలేకపోయారనిపించింది. అది ఇంట్రెస్టింగ్‌గా లేకుండా కాస్తా ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది.

కానీ, శ్రీలంకలోని తెగ, గ్యాంగ్‌స్టర్ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. ఆ లోకంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. క్లైమాక్స్ పర్వాలేదు. కింగ్డమ్ పార్ట్ 2కి హింట్ ఇచ్చేలా క్లైమాక్స్ ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. అనిరుధ్ బీజీఎమ్, సంగీతం అలరించేలా ఉన్నాయి.

ఇక విజయ్ దేవరకొండ నటన విషయానికొస్తే చాలా బాగుంది. మొదటి నుంచి చూసుకుంటే మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌తో నటించాడు. అది బాగా సెట్ అయింది. ఇక మరో హీరో సత్యదేవ్ యాక్టింగ్ పరంగా అదరగొట్టాడు. తన రోల్‌లో ఇంటెన్సిటీ చూపించాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కనిపించినంతసేపు అట్రాక్ట్ చేసింది.

సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నుంచి ఆశించిన స్థాయిలో టేకింగ్ రాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే అన్నకోసం యుద్ధం చేసే తమ్ముడి మూవీ కింగ్డమ్‌పై అలా ఓ లుక్కేయొచ్చు.

మొత్తంమీద, కింగ్డమ్ సినిమాలో కొన్ని బలమైన అంశాలు ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల లాగింగ్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే, విజయ్ దేవరకొండ మరియు సత్యదేవ్ నటన, శ్రీలంక బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.