
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విటర్ ద్వారా పంచుకుంటున్నారు. విజయ్ ‘అనకొండలా’ తిరిగొచ్చాడని నెటిజన్లు అంటున్నారు.
Key Points
విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు
అన్నదమ్ముల బంధం అద్భుతంగా చూపించారు
ఓవర్సీస్ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్
ట్విటర్‌లో ‘కింగ్డమ్’కు అభిమానుల స్పందన
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ కింగ్డమ్ ’ థియేటర్స్ లోకి వచ్చేసింది . నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు . ఇ ప్పటికే ఓవర్సీస్ లలో సినిమా పూర్తి అయింది . దీంతో వారు ట్విటర్ వంటి సోషల్ మీడియాలలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు . సరైన విజయం కోసం విజయ్ దేవరకొండ కొంతకాలంగా ఎదురుచూస్తున్న క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకుడితో సినిమా ప్రకటించాడు . వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించగా సత్యదేవ్ కీలకపాత్రలో నటించారు. సత్యదేవ్, విజయ్‌దే వరకొండ అన్నదమ్ముల పాత్రల్లో కనిపించారు. వారి బంధం ఎలా ఉందో నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు .
కింగ్‌డమ్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఒక అనకొండలా తిరిగొచ్చాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు . ఇదొక ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ అంటూ .. అన్నదమ్ముల అనుబంధం గురించి అద్భుతంగా చూపించారని చెబుతున్నారు . విజయ్ దేవరకొండ , సత్య దేవ్ తమ నటనతో అదరగొట్టారని అంటున్నారు . ఈ సినిమా కోసం అనిరుధ్ సంగీతంతో ఫుల్ డ్యూటీ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు . అద్భుతమైన స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో అత్యుత్తమ నటన కనబరిచారని విజయ్ ని అభినందిస్తున్నారు . టైర్ -1 హీరోల లిస్ట్ లోకి తెలంగాణోడు వచ్చేశాడని పేర్కొన్నారు .
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటనకు ప్రశంసలు
‘ కింగ్డమ్’ టైటిల్ కార్డ్ నుంచే మెప్పించేలా ఉందని ఫ్యాన్స్ తో పాటు కామన్ ప్రేక్షకులు కూడా చెబుతున్నారు . సినిమా ప్రారంభం కావడమే సీన్ తో ఉంటుందని , ఆపై కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు . కథ విషయంలో ఎక్కడా కూడా పక్కదారి పట్టకుండా ఖచ్చితమైన స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచిందన్నారు . మెత్తం మీద సినిమా బ్లాక్ బస్టర్ అంటూ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి.
ఫస్టాప్ ఎంత బలంగా ఉందో సెకండాఫ్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉందని ఎక్కువ రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలోని జైలు సీన్స్ తో పాటు బోట్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన బలమంటున్నారు . బక్కోడు ఫుల్ డ్యూటీ చేశాడంటూ అనిరుధ్ బీజీఎమ్ తో ప్రతి సీన్ ను భారీగా ఎలివేట్ చేశాడని చెప్పుకుంటున్నారు .
అనిరుధ్ సంగీతం, కథనం ప్రేక్షకులను మెప్పించాయి
కింగ్ డమ్ లో ఎక్కువ పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి . అయితే , కొందరు మాత్రం కేజీఎఫ్ , పుష్ప , బాహుబలి వంటి సీన్స్ కింగ్డమ్ లో గుర్తుకుచేస్తాయని చెబుతున్నారు . ఫస్టాప్ లో చాలా బలంగా ఉందని అందుకు తగ్గట్టుగా సెకండాఫ్ లేదని మరికొందరు అంటున్నారు . క్లైమాక్స్ కాస్త నిరూత్సాహపరిచాడని కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి .
మొత్తంమీద, ‘కింగ్డమ్’ సినిమా టెక్నికల్ గా చాలా బలంగా ఉందని, విజయ్ దేవరకొండ తన నటనతో అలరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.


