|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే.. ప్రోమో కూడా రిలీజ్..

Published: 07-07-2025, 9:51 AM
Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే.. ప్రోమో కూడా రిలీజ్..

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ నటించిన ‘కింగ్డమ్’ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు. జూలై 31న విడుదల కానున్న ఈ చిత్రం ప్రోమో ఇప్పటికే విడుదలైంది. విజయ్ దేవరకొండ పోలీసులు, ఖైదీగా కనిపించే విధానం ఆసక్తికరంగా ఉంది.

Key Points

1

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ నటించిన 'కింగ్డమ్' కొత్త రిలీజ్ డేట్ ప్రకటన

2

జూలై 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

4

కింగ్డమ్ సినిమా కేవలం సినిమా కాదు, ఒక గొప్ప ప్రపంచం అని నిర్మాతలు

కింగ్డమ్ కొత్త రిలీజ్ డేట్

Kingdom : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే కింగ్డమ్ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా కింగ్డమ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఓ ప్రోమో రిలీజ్ చేసారు. కింగ్డమ్ సినిమాని జులై 31న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ప్రోమోలో విజయ్ మరింత పవర్ ఫుల్ గా కనిపించాడు. ప్రోమోలో విజయ్ పోలీస్ కానిస్టేబుల్ గా, జైలు లో ఖైదీగా కూడా కనిపించడంతో ఇదేదో కొత్త స్టోరీలానే ఉంది అని తెలుస్తుంది.

ప్రోమోలో విజయ్ దేవరకొండ

కింగ్డమ్ కొత్త ప్రోమో మీరు కూడా చూసేయండి..

నిర్మాతల ప్రకటన

కొత్త విడుదల తేదీ ప్రకటిస్తూ నిర్మాతలు మాట్లాడుతూ.. కింగ్డమ్ కేవలం సినిమా కాదు. ఇది మేము ఎంతో మక్కువతో నిర్మించిన ఒక గొప్ప ప్రపంచం. ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకున్నాము. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుంది అని అన్నారు.

చివరగా, ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రోమోలో కనిపించిన విజయ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.