|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kiran Abbavaram: కే ర్యాంప్ గ్లింప్స్ అప్డేట్.. ఒక రిచ్చెస్ట్ చిల్లర్ గాయ్ వస్తున్నాడు ఎంజాయ్ చేయండి

Published: 12-07-2025, 9:28 PM
Kiran Abbavaram: కే ర్యాంప్ గ్లింప్స్ అప్డేట్.. ఒక రిచ్చెస్ట్ చిల్లర్ గాయ్ వస్తున్నాడు ఎంజాయ్ చేయండి

కిరణ్ అబ్బవరం నటించిన ‘కే-ర్యాంప్’ సినిమా గ్లింప్స్ విడుదల తేదీని దర్శకనిర్మాతలు ప్రకటించారు. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 దివాళీకి విడుదల కానుంది.

Key Points

1

కిరణ్ అబ్బవరం, జైన్స్ నాని కాంబినేషన్‌లో 'కే-ర్యాంప్' సినిమా

2

యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు

4

నవంబర్ 14న గ్లింప్స్ విడుదల

‘కే-ర్యాంప్’ సినిమా గ్లింప్స్ అప్డేట్

హీరో కిర‌ణ్ అబ్బవ‌రం, డైరెక్టర్ జైన్స్ నాని కాంబినేషనల్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కే-ర్యాంప్‌’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. 2025 దివాళీ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ప్రమోషనల్ వీడియో షేర్ చేశారు. ఇందులో డైరెక్టర్ నాని: కే ర్యాంప్ నుంచి ఏదన్నా అప్డేట్ ఇస్తే బాగుంది అన్నా అని అంటాడు.

కిరణ్ అబ్బవరం: ఇద్దాంలే నాని తొందర ఏముంది. నాని: అన్నా.. నువ్వు సోషల్ మీడియా చేస్తున్నట్లు లేవు.. రెండు సంవత్సరాలకు రెండు సినిమాలే చేశావని తెగ ఏసుకుంటున్నారు మనల్ని. సీనియర్ హీరోస్ అనుకో రెండు సంవత్సరాలకు ఒక్క సినిమా తీసిన పర్వాలేదు.. మనలాంటి యంగ్ హీరోస్ కూడా ఇలాగే చేస్తే ఇండస్ట్రీ ఏమైపోవాలి. కిరణ్: ఓహో.. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ అని ఏసుకున్నారు. ఇప్పుడు ఇలా చేస్తున్న బ్యాడ్‌గా మాట్లాడుకుంటున్నారు కలికాలం ఏం చెయ్యలేం. నాని: ఏం చెయ్యంలేం ఏంటీ అన్నా.. నీ బర్త్‌డేకు మన సినిమా నుంచి గ్లింప్స్ వేద్దాం. కిరణ్: బర్త్‌డేకు అప్డేట్‌లు వద్దు. నువ్వు ఇచ్చిన అప్డేట్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది అనుకో సంతోషంగా కేక్ కట్ చేయోచ్చు. అదే నెగిటివ్‌గా వచ్చిందనుకో బాధపడుతూ కేక్ కట్ చేస్తే అంత బాగోదు. నాని: నన్ను నమ్ము అన్నా.. మన గురించి ఒక ఎలివేషన్ ఇచ్చి వస్తా అంటూ ముందుకు వచ్చి.. ఈనెల 14న కే ర్యాంప్ నుంచి ఒక రిచ్చెస్ట్ చిల్లర్ గ్యాయ్ వస్తున్నాడు చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ గ్లింప్ 14న రాబోతున్నట్లు ప్రకటించాడు డైరెక్టర్. లింక్

రిలీజ్ తేదీ ప్రకటన

కిరణ్ అబ్బవరం, జైన్స్ నాని కాంబినేషన్

చివరగా, ‘కే-ర్యాంప్’ సినిమా గ్లింప్స్ నవంబర్ 14న విడుదల కానున్నట్లు ప్రకటించారు. 2025 దివాళీకి సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.