
📌 Key Points
- ‘క’ మూవీ సీక్వెల్ నుంచి కిరణ్ అబ్బవరం అవుట్! అభిమానులకు షాకింగ్ న్యూస్!!
- 2024 దీపావళికి విడుదలై బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘క’ మూవీ సంచలనం!
- శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల కృష్ణ నిర్మాణంలో సీక్వెల్ పనులు ప్రారంభం!
- 2027 జనవరిలో ‘క’ సీక్వెల్ విడుదల! దర్శకులు సుజీత్, సందీప్ దర్శకత్వంలో సినిమా!
కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఊహించని ట్విస్ట్! సూపర్ హిట్ చిత్రం ‘క’ సీక్వెల్ నుండి కిరణ్ తప్పుకున్నారా? నిర్మాత షాకింగ్ ప్రకటనతో ఒక్కసారిగా సినీ వర్గాల్లో కలకలం రేగింది. అసలేం జరిగింది?
‘క’ సీక్వెల్ లో కిరణ్ ఉండడా?
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కెరీర్ లో ‘క’ సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా వచ్చిన క సినిమా 2024 దీపావళికి వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల కృష్ణ నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో తెరకెక్కించారు.(Kiran Abbavaram)
ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. క సినిమా చివర్లోనే క సీక్వెల్ అధికారికంగానే అనౌన్స్ చేసారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. క సినిమా నిర్మాత చింతా గోపాల కృష్ణ ఇప్పుడు శ్రీ చిదంబరం గారు సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో క సినిమా సీక్వెల్ పై మీడియా ప్రతినిధులు అడగ్గా స్పందించారు.
నిర్మాత సంచలన వ్యాఖ్యలు వైరల్!
నిర్మాత చింతా గోపాల కృష్ణ ‘క’ సినిమా సీక్వెల్ పై స్పందిస్తూ.. క సినిమా సీక్వెల్ 2027 లో ఉంటుంది. దర్శకులు వాళ్ళే. నా నిర్మాణంలోనే ఉంటుంది. హీరో ఎవరు అనేది దర్శకుల ఇష్టం. వేరే వాళ్ళతో తీయొచ్చు. క సినిమా కంటెంట్ బాగుందని అందరూ అన్నారు. ఆ కంటెంట్ నమ్మి నేను దానికి భారీ బడ్జెట్ పెట్టి తీసాను. పర్ఫార్మెన్స్ ల కంటే కూడా సినిమా కంటెంట్ గురించే అందరూ మాట్లాడారు. ప్రస్తుతం క సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
2027లో ‘క’ సీక్వెల్ విడుదల!
త్వరలోనే అధికారికంగా ఆ సినిమాని ప్రకటిస్తాము. 2027 జనవరిలో ఆ సినిమా వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. దీంతో క సీక్వెల్ లో కిరణ్ అబ్బవరం ఉండకపోవచ్చు అని, ఆ కథకి కొనసాగింపుగా కాకుండా ఇంకో కథ ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై కిరణ్ అబ్బవరం ఏమైనా స్పందిస్తాడా చూడాలి.
చింతా గోపాల కృష్ణ చేసిన ఈ ప్రకటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కిరణ్ అబ్బవరం ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


