|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kiran Abbavaram: పవన్‌ కల్యాణ్‌ సినిమాలో క్యారెక్టర్‌.. నాకిష్టం లేదు!

Published: 19-10-2025, 4:18 AM
Kiran Abbavaram: పవన్‌ కల్యాణ్‌ సినిమాలో క్యారెక్టర్‌.. నాకిష్టం లేదు!

నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా తన కెరీర్, పవన్ కల్యాణ్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ రోల్స్ చేయకూడదని నిర్ణయించుకున్నానని, తన హీరో కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశారు. పవన్ అభిమానిగా ఉన్నప్పటికీ, ఆయన సినిమాలో క్యారెక్టర్ రోల్ ఆఫర్ వచ్చినా ఒప్పుకోనని తెలిపారు.

Key Points

1

కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' చిత్రంతో ఈ దీపావళికి మంచి హిట్‌ అందుకున్నాడు.

2

రచయితగా ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా షార్ట్ ఫిలింస్ ద్వారా హీరోగా మారాడు.

4

కేవలం తాను మాత్రమే చేయగలిగే పాత్ర వస్తేనే పవన్ సినిమాలో నటిస్తానని తెలిపాడు.

‘కె-ర్యాంప్’ హిట్‌తో కిరణ్ అబ్బవరం

ఈ సారి దీపావళికి థియేటర్స్‌ కళకళలాడుతున్నాయి. ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్‌, కె-ర్యాంప్‌ ఒకటీరెండు రోజుల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటన్నింటిలో కె-ర్యాంప్‌ సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఈ పండక్కి హాయిగా నవ్వుకునేలా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

షార్ట్‌ ఫిలింస్‌ నుంచి హీరోగా.. దీంతో కిరణ్‌ అబ్బవరా నికి ( Kiran Abbavaram ) పెద్ద హిట్టే అందినట్లు కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇతడు మాట్లాడుతూ.. సైడ్‌ క్యారెక్టర్లు చేయనని చెప్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ.. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. రచయిత అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అనుకోకుండా షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. నాకంటూ ఏదో గుర్తింపు కావాలనిపించింది. షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా వచ్చిన గుర్తింపుతో రాజావారు రాణిగారు సినిమా ఛాన్స్‌ వచ్చింది. ఈ మూవీ హిట్టవడంతో పేరొచ్చింది.

హీరోగా తన ప్రస్థానం.. పవన్ అభిమానిగా

లైఫ్‌ చేంజ్‌ జనాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? అని ఆలోచించి ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం కథ రాసుకున్నాను. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. కాలేజీలో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానినే! ఆయన సినిమాలు ఎంజాయ్‌ చేశాను. కానీ, సినిమా ఇండస్ట్రీకి వచ్చాక జీవితం మారిపోయింది. హీరోగా నా కెరీర్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాను.

క్యారెక్టర్స్‌ చేయను పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా.. నాకంటూ సొంత గుర్తింపు కోరుకుంటున్నా.. కాబట్టి ఈ సమయంలో క్యారెక్టర్స్‌ చేయలేను. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్‌ చేస్తా! ఒకవేళ.. కిరణ్‌ అబ్బవరం మాత్రమే చేయగలిగే క్యారెక్టర్‌ అంటే అప్పుడు కచ్చితంగా చేస్తాను. కేవలం పవన్‌ సినిమాలో కనిపించాలని మాత్రం చేయను అని కిరణ్‌ అబ్బవరం చెప్పుకొచ్చాడు.

క్యారెక్టర్ రోల్స్‌పై కిరణ్ స్పష్టత

కిరణ్ అబ్బవరం తన హీరో కెరీర్‌కు కట్టుబడి ఉన్నారని, కేవలం ప్రత్యేకమైన, తనకు మాత్రమే సరిపోయే పాత్రల కోసం తప్ప ఇతర క్యారెక్టర్ రోల్స్‌ను అంగీకరించబోనని స్పష్టం చేశారు. తన లక్ష్యంపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.