|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kireeti: కిరిటీ జూనియర్ మూవీ.. కారు స్టంట్‌ రియల్ వీడియో చూశారా?

Published: 22-07-2025, 6:52 AM
Kireeti: కిరిటీ జూనియర్ మూవీ.. కారు స్టంట్‌ రియల్ వీడియో చూశారా?

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి నటించిన ‘జూనియర్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నడుస్తోంది. ఈ సినిమాలోని ఓ ప్రమాదకరమైన కారు స్టంట్‌కు సంబంధించిన వీడియోను కిరిటీ ఇప్పుడు విడుదల చేశాడు.

Key Points

1

కిరిటీ రెడ్డి హీరోగా నటించిన ‘జూనియర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

2

సినిమాలోని కారు స్టంట్ షూటింగ్ వీడియోను కిరిటీ రెడ్డి షేర్ చేశారు.

4

పీటర్ హెయిన్ మాస్టర్ మరియు సిబ్బందికి కిరిటీ ధన్యవాదాలు తెలిపారు.

జూనియర్ సినిమా విజయం

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్‌’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించగా.. జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూలై 18న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే హీరో కిరిటీ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలోని ఓ సీన్‌కు సంబంధించిన ఒరిజినల్ షూట్ వీడియోను పంచుకున్నారు. కారుపై నుంచి కిరిటీ జంప్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించాడో ఈ వీడియోలో చూపించారు. ఈ షూటింగ్ స్టంట్‌ ‍కోసం కష్టపడిన పీటర్‌ హెయిన్ మాస్టర్‌తో పాటు సిబ్బందికి హీరో ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్‌గా రిజల్ట్ ఇలా వచ్చిందంటూ వీడియోలో మూవీ సీన్‌ చూపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

కిరిటీ రెడ్డి స్టంట్ వీడియో

షూటింగ్ ప్రయత్నాలు

చివరగా, కిరిటీ రెడ్డి తన కష్టపడి చేసిన స్టంట్ యొక్క వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సినిమా విజయానికి ఇది మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.