
📌 Key Points
- అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.
- తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
- తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని ఆరోపణ.
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని భావించామని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి అప్పటి ప్రభుత్వాలు సహకరించలేదని ఆరోపించారు.
అమరావతి బిల్లుకు కిషన్ రెడ్డి మద్దతు
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు – 2026పై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గురించి కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు.
సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 1969లో జై తెలంగాణ అన్నందుకు 369 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందన్నారు. ఆ తర్వాత చివరిదశ తెలంగాణ ఉద్యమంలోనూ.. 1200 మంది ఆత్మబలిదానం చేశారని గుర్తు చేశారు. వారి త్యాగంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
‘రాష్ట్రం విడిపోయిన తర్వాత.. తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పోటీగా అభివృద్ధి చెందాలని భావించాం. కానీ అక్కడి మా సోదర, సోదరీమణలులు మాకు రాజధాని లేదని బాధపడే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం. ఈరోజు బిల్లుపై చర్చ సందర్భంగా.. కాంగ్రెస్ సభ్యులు కొందరు.. తెలంగాణకు విమానాశ్రయాలు లేవని చెప్పారు. తెలంగాణలో విమానాశ్రయాలు లేకపోవడానికి కారణం ఎవరు ఆ పాపం పాపం ఎవరిది చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్‌లో 8 విమానాశ్రయాలున్నాయంటే. తెలంగాణ లో కేవలం ఒక ఎయిర్‌పోర్ట్ మాత్రమే ఉంది.’ అని కిషన్ రెడ్డి అన్నారు.
అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విమానాశ్రయాలు ఇవ్వలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగూడెంలో, వరంగల్‌లో, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలకు భూమి కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా.. ఈ విమానాశ్రయాలకు భూములు ఇవ్వలేదని, కనీసం స్పందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో.. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు భూములు కావాలని అడిగినా బీఆర్ఎస్ వ్యవహరించిన తీరే కాంగ్రెస్ వ్యవహారించిందన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి జరగలేదు. తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడింది కాబట్టే.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. కచ్చితంగా ఇవాళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇవాళ ఈ దిశగా ఓ సానుకూలమైన పరిస్థితి రావడం చాలా సంతోషంగా ఉంది.’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
అంతేకాకుండా.. అన్నదమ్ముల్లాగా ఈ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీలో కూడా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందన్నారు. తెలంగాణలోనూ రైల్వేలు, జాతీయ రహదారులు మొదలుకుని అన్నిరకాల అభివృద్ధి పనులకు కేంద్రం అండదండగా నిలుస్తోందన్నారు.
42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఏకకాలంలో చేసుకుంటున్నామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. గతంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులుంటే.. ఈ పదేళ్లలో అదనంగా దాదాపు 3 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసింది కాబట్టే.. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన.. అమరావతి రాజధానిగా ఏర్పాటవుతున్న సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు అని చెప్పారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
‘గతంలో పదేళ్లపాటు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో.. తెలంగాణను దోచుకుంటోంది. దీన్నుంచి తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆ లక్ష్యాల సాధన జరగడం లేదు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతోంది.’ అంటూ కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తానికి, కిషన్ రెడ్డి అమరావతికి మద్దతు తెలుపుతూ తెలంగాణ అభివృద్ధి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.


