
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో ప్రతిష్టాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ‘భారత్ భాగ్య విధాత’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కంగనా మంటల్లో చిక్కుకున్న వారిని తన ప్రాణాలకు తెగించి కాపాడుతున్నట్లు కనిపిస్తుండగా.. ధైర్యం, త్యాగం, మానవత్వం, ఐక్యతతో నిండిన ఒక భావోద్వేగభరితమైన కథను అందిస్తుందని ఈ పోస్టర్ తెలుపుతుంది. ప్రజెంట్ ఈ పవర్‌ఫుల్ పోస్టర్ వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. మనోజ్ తపాడియా రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రధానంగా భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ‘26/11 ముంబై ఉగ్రదాడుల చుట్టూ తిరుగుతుంది. ఆ రాత్రి కామా అండ్ ఆల్‌బ్లెస్ హాస్పటల్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. PEN స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం 12 జూన్ 2026న థియేటర్లలో విడుదల కానుంది.


