|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోహ్లీ లైక్‌తో 20 లక్షలు మంది ఫాలో.. ఇంత ఖాళీగా ఉన్నారా: రకుల్‌

Published: 30-05-2025, 12:49 AM
కోహ్లీ లైక్‌తో 20 లక్షలు మంది ఫాలో.. ఇంత ఖాళీగా ఉన్నారా: రకుల్‌

బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేయడం వైరల్ అయింది. ఈ ఘటనపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ, సోషల్ మీడియాలో ఇంత ఖాళీ సమయం ఉందా అని ప్రశ్నించారు.

Key Points

1

విరాట్ కోహ్లీ అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని పోస్ట్‌ను లైక్ చేయడం వైరల్‌

2

రకుల్ ప్రీత్ సింగ్, ఈ వైరల్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలోని ఖాళీ సమయాన్ని ప్రస్తావించారు.

4

అవ్నీత్ కౌర్ కు 20 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు.

కోహ్లీ లైక్‌ వైరల్‌

బాలీవుడ్‌ నటి అవ్‌నీత్‌ కౌర్‌(Avneet Kaur) ఫ్యాన్‌ పేజీలోని ఒక పోస్ట్‌ను క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ( Virat Kohli) లైక్‌ చేయడంతో ఆ వార్త సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయింది. ఇప్పుడు దాని గురించి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌( Rakul Preet Singh) మాట్లాడారు. దేశంలో మనం ఇంత కాళీగా ఉన్నామా అంటూ తనదైన స్టైల్లో కామెంట్‌ చేసింది. ఇలాంటి వాటిని ఎందుకు వైరల్‌ చేస్తారని ఆమె ప్రశ్నించారు. అవసరం లేని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంతమాత్రం కరెక్ట్‌ కాదని సూచించారు.

రకుల్ ప్రతిస్పందన

అవ్‌నీత్‌కౌర్‌ ఫ్యాన్‌ పేజీలోని ఒక ఫోటోను విరాట్‌ లైక్‌ చేయడంపై రకుల్‌ ఇలా చెప్పుకొచ్చారు. ‘ ఈ అంశం నన్ను చాలా బాధించింది. హమ్ బోహోత్ వేలే హై (మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా..) అనిపించింది. విరాట్‌ లైక్‌ వల్ల ఆమెకు(అవ్‌నీత్‌కౌర్‌) 20 లక్షల మంది ఫాలోవర్స్‌ కొన్ని గంటల్లోనే పెరిగారు. పొరపాటున లైక్‌ బటన్‌ ప్రెస్‌ అయిందని చెప్పినా కూడా పెద్ద సంఖ్యలో ఆమెను అనుసరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో  ఒక్కోసారి మనం కూడా పొరపాటున స్నేహితులను అన్‌ఫాలో చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా కామన్‌గా జరిగే అంశాలు. విరాట్‌ కూడా వివరణ ఇచ్చారు. కానీ, విరాట్‌ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు నచ్చిన, నచ్చని అంశాలు అన్నీ వార్తలుగా మారిపోతున్నాయి. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఇలా వైరల్‌ చేయడం చాలా విచారకరమైన విషయం. సోషల్‌ మీడియాలో చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నారు.’ అని ఆమె అన్నారు.

సోషల్ మీడియా విమర్శ

ఆ అంశంపై కోహ్లీ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీడ్‌ను క్లియర్‌ చేస్తున్న క్రమంలో పొరపాటున లైక్‌ బటన్‌ ప్రెస్‌ అయి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంలో ఎలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పారు. అవసరంలేని ప్రచారాలు చేయకండని కూడా కోరారు.

చివరగా, సోషల్ మీడియాలోని అనవసరమైన వైరల్‌లను తగ్గించుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ సూచించారు. ఈ ఘటన సోషల్ మీడియాలోని ఖాళీ సమయం గురించి చర్చను రేకెత్తించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.