
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ అకాల మరణం సినీ ప్రేమికులను విషాదంలో ముంచింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందారు. ఈ విషాదంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Key Points
కోలీవుడ్ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ హఠాన్మరణం
బస్సు ఎక్కే సమయంలో హార్ట్ ఎటాక్ తో మరణం
నటుడు శాంతను భాగ్యరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం
‘థెరం బోరం’ చిత్రం షూటింగ్ ముగియక ముందే విషాదం
విక్రమ్ సుకుమారన్ మృతి
గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోతూ అభిమానులను విషాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్(Vikram Sukumaran) మృతి చెందారు. మధురైలో బస్సు ఎక్కుతుండగా.. ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో విక్రమ్ మరణం కోలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో విక్రమ్ వర్క్ చేసిన శాంతను భాగ్యరాజ్(Shantanu Bhagyaraj) ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
శాంతను భాగ్యరాజ్ ట్వీట్
‘‘మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. సోదరుడిలా భావించే నీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు. మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం శాంతను ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సైతం ఆయన ఆత్మ శాంతించాలని కోరుతున్నారు.
కోలీవుడ్‌లో విషాదం
కాగా, విక్రమ్ సుకుమారన్ సినిమా విషయానికొస్తే.. ఆయన మధయనాయక్ కుట్టం చిత్రంతో 2013లో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాలు తెరకెక్కించిన ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన చివరగా ‘థెరం బోరం’ మూవీకి దర్శకుడిగా వ్యవహరించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే సడెన్‌గా ఇలా జరగడం టీమ్ మొత్తాన్ని కలచివేసేలా చేస్తోంది.
విక్రమ్ సుకుమారన్ మరణం కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శాంతను భాగ్యరాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


