
మంత్రి కొండా సురేఖ, నటుడు నాగార్జున మధ్య కొనసాగిన వివాదానికి తెరపడింది. నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యల పట్ల కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో, నాగార్జున ఆమెపై దాఖలు చేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది.
Key Points
నాగార్జున, కొండా సురేఖ మధ్య వివాదం ముగిసింది.
మంత్రి సురేఖపై దాఖలైన క్రిమినల్ కేసును నాగార్జున ఉపసంహరించుకున్నారు.
నాగచైతన్య, సమంత విడాకుల వ్యాఖ్యలపై సురేఖ క్షమాపణ చెప్పారు.
నాగార్జున నిర్ణయంతో వివాదానికి ముగింపు పడింది.
నాగార్జున, కొండా సురేఖ వివాదం నేపథ్యం
మంత్రి కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జున కటుంబం వివాదానికి ఎండ్ కార్డు పడింది. మంత్రి కొండ సురేఖపై (Konda Surekha) దాఖలు చేసిన క్రిమినల్ కేసును కేసును నాగార్జున (Nagarjuna) విత్ డ్రా చేసుకున్నారు. గతంలో నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ ఇటీవల క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లికోర్టులో ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా వర్చువల్ గా హాజరైన నాగార్జున తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. నాగార్జున నిర్ణయాన్ని కోర్టు ఆమోదించడంతో మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జునకు మధ్య వివాదం ముగిసినట్లైంది. మంగళవారం అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా వేదికగా నాగార్జునకు క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జునను గానీ ఆయన కుటుంబాన్ని గానీ కించపరిచే ఉద్దేశం లేదని ఆ ట్వీట్‍లో పేర్కొన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.
కొండా సురేఖ క్షమాపణ, ట్వీట్ వివరాలు
క్రిమినల్ కేసు ఉపసంహరణ: నాగార్జున నిర్ణయం
నాగార్జున కీలక నిర్ణయంతో కొండా సురేఖకు పెద్ద ఊరట లభించింది. క్షమాపణల అనంతరం కేసును ఉపసంహరించుకోవడం ద్వారా ఇరుపక్షాల మధ్య సామరస్య వాతావరణం నెలకొంది. ఈ సంఘటన సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య వివాదాలకు సయోధ్యతో కూడిన ముగింపును చూపింది.


