
రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర నటించిన ‘కూలీ’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన క్రిటిక్ రివ్యూలో సినిమా గురించి మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి.
Key Points
రజనీకాంత్, నాగార్జున కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్!
క్రిటిక్ రివ్యూ: రజనీకాంత్ పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్!
క్లైమాక్స్ లో 20 నిమిషాలు సినిమా వేరే లెవెల్!
పూనకాలు తెప్పించే సర్‌ప్రైజ్‌తో అందర్నీ షాక్ చేయనుంది!
‘కూలీ’పై భారీ అంచనాలు
ప్రస్తుతం సినీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న మూవీ `కూలీ`. భారీ కాస్టింగ్‌తో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా మొదటిసారి రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అలాగే ఇందులో నాగార్జున విలన్ రోల్ చేయడం మరింత క్రేజీగా మారింది. తన కెరీర్‌లోనే మొదటిసారి ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. అది కూడా రజనీకాంత్ వంటి సూపర్ స్టార్‌కి విలన్‌గా, ఆయనతో పోటీ పడే పాత్రలో నాగ్ కనిపిస్తారనే వార్త తెలుగు ఆడియెన్స్ కి మతిపోయేలా చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో లేదు, కానీ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఎక్కువగా పాత్రలను పరిచయం చేయడానికే ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమోషనల్‌గానూ కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ సినిమాలో ఏదో ఉండబోతుందనే ఆశలను రేపుతుంది. పైగా పలు ఇంటర్వ్యూస్‌లో సినిమాకి సంబంధించిన పలు క్రేజీ విషయాలు వెల్లడించారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. యాక్షన్ విషయంలో రాజీపడలేదని, రజనీకాంత్ సార్‌ని వేరే లెవల్‌లో చూపించినట్టు చెప్పారు. దీంతో సెన్సార్ ఏకంగా `ఏ`సర్టిఫికేట్ వచ్చింది. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత రజనీ మూవీకి ఏ సర్టిఫికేట్ రావడంతోనే ఇందులో హింస ఏ రేంజ్‌లో ఉండబోతుందనేది అర్థం చేసుకోవచ్చు.
క్రిటిక్స్ రివ్యూలో ఏముంది?
ఇంకోవైపు తాజాగా క్రిటిక్ రివ్యూ వచ్చిది. ఓవర్సీస్ క్రిటిక్‌గా పిలవబడే ఉమైర్ సందు ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఇచ్చారు. ఆయన సెన్సార్ సభ్యుడిగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన `కూలీ` రివ్యూని వెల్లడించారు. పూనకాలు తెప్పించే విషయాలు బయటపెట్టాడు. రజనీకాంత్ వన్ మ్యాన్ షో అని, ఆయన అందరి చూపు తనవైపు తిప్పుకుంటాడని తెలిపారు. ఆయనది పవర్ ప్యాక్డ్ పర్‌ఫెర్మెన్స్ అని చెప్పారు. కథ, స్క్రీన్‌ప్లే యావరేజ్‌గా ఉంటాయట. రజనీతోపాటు సపోర్టింగ్ యాక్టర్స్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ అదరగొట్టారని, వీరి నటనే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందన్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ లో లాస్ట్ 20 నిమిషాలు సినిమా వేరే లెవల్‌లో ఉంటుందట. అదే సినిమాకి మెయిన్ అని, అందులో బిజీఎం, యాక్షన్ వేరే లెవల్ అన్నారు. అంతటితో ఆగలేదు, ఇందులో ఒక బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఉందట. దాన్ని చూసి అంతా షాక్ అవుతారని తెలిపారు. పూనకాలు తెప్పించేలా ఆ సర్‌ప్రైజ్ ఉంటుందన్నారు. మరోవైపు రజనీ, నాగ్ మధ్య వచ్చే సీన్లు పిచ్చెక్కించేలా ఉంటాయని అంటున్నారు. మొత్తంగా పైసా వసూల్ మూవీ అని, రజనీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. ఓవరాల్‌గా మూవీకి బ్లాక్ బస్టర్ రేటింగ్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ మూవీకి, ఇంతటి భారీ కాస్టింగ్ ఉన్న సినిమాకి గొప్ప కథ అవసరం లేదు. జస్ట్ యావరేజ్ నుంచి, ఎబౌ యావరేజ్ ఉన్నా చాలు, దుమ్ములేపుతుంది. మరి `కూలీ` ఆ మ్యాజిక్ చేస్తుందా? అనేది చూడాలి.
సినిమా హైలైట్స్
ఇదిలా ఉంటే ఉమైర్ సందు చెప్పినట్టు ఇందులో ఉన్న పెద్ద సర్‌ప్రైజ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మరో హీరో ఎంట్రీ ఇస్తారా? అనే ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం `విక్రమ్(కమల్ హాసన్) ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ట్రైలర్‌ని డీ కోడ్ చేస్తూ `విక్రమ్` సినిమాకి లింక్ పెట్టి చూస్తూ కమల్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని, ఇది లోకేష్ `ఎల్‌సీయూ`లో భాగంగా వస్తోన్న మూవీనే అని అంటున్నారు. కాకపోతే ఇది `ఎల్‌సీయూ` మూవీ కాదని లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సర్‌పిక్చర్స్ నిర్మించింది. సుమారు రూ.400కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా విడుదల కాబోతుంది.
మొత్తం మీద, ‘కూలీ’ సినిమా రజనీకాంత్ అభిమానులకు ఒక వినోదాత్మక అనుభవాన్ని అందిస్తుందని క్రిటిక్ రివ్యూ సూచిస్తుంది. క్లైమాక్స్ లోని సర్‌ప్రైజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.


