
📌 Key Points
- పుట్టపర్తి జిల్లా కొర్లకుంటలో ఎస్సీ శ్మశానవాటిక లేక దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమస్యను వ్యక్తిగతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
- మూడు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని బాలకృష్ణ ఎస్సీ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు.
- నవంబర్ నుండి దళితులు తమ సమస్య పరిష్కారం కోసం 51 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.
పుట్టపర్తి జిల్లాలోని కొర్లకుంట ఎస్సీ శ్మశానవాటిక సమస్యపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. దళితులు పడుతున్న ఇబ్బందులపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ, మూడు రోజుల్లో సమస్యను వ్యక్తిగతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులకు కొంత ఊరట లభించింది.
కొర్లకుంట శ్మశానవాటిక సమస్య: దళితుల దీర్ఘకాలిక పోరాటం
Nandamuri Balakrishna: పుట్టపర్తిలోని చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామం ఎస్సీ శ్మశాన వాటిక ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు . శ్మశాన వాటిక లేక దళితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు ఉన్న శ్మశానంలోకి వెళ్లాలని చూస్తే చుట్టూ ఉన్న రైతులు దారి మూసేయడంతో వారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . కాలనీలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలు కూడా సరిగా చేయలేని దుస్థితి నెలకొంది.
శ్మశానానికి దారి చూపాలని కాలనీ వాసులు పాదయాత్ర చేపట్టారు . గత నవంబర్ లో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికి కొనసాగుతూనే ఉంది . తాజాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి తమ సమస్యను పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు . ఎస్సీ కాలనీవాసులతో ఆయన నేరుగా ఫోన్ లో మాట్లాడారు . మూడు రోజుల్లో వ్యక్తిగతంగా సమస్యను పరిష్కరిస్తానని , ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ ఎస్సీ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు . కాగా గతంలో కాలనీ వాసులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా వారి సమస్యకు పరిష్కారం దొరకలేదు .
ఎస్సీలకు ప్రత్యేకంగా శ్మశానవాటిక కేటాయిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని భావించిన దళితులు దేమకేతేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు ఇటీవల పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు . గత నవంబర్ లో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది . దేమకేతేపల్లి, చిలమత్తూరు, కొడికొండ, కోడూరుతోపు, శెట్టిపల్లి, బూదిలి, గుమ్మయ్యగారిపల్లి, పెడపల్లి, జగరాజుపల్లి మీదుగా 51 కిలోమీటర్ల దూరం వారు పాదయాత్ర చెపట్టారు . ఆదివారం మామిళ్లకుంట క్రాస్‌కు చేరుకుంది. పాదయాత్ర బృందంలోని దళితులు అక్కడి కమ్యూనిటీ భవనంలో బస చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, సమస్య గురించి విన్నవిస్తామని అధికారులు చెబుతూ వస్తున్నారని వారు మీడియాతో పేర్కొన్నారు .
బాలకృష్ణ జోక్యం: మూడు రోజుల్లో పరిష్కారం హామీ
కొర్లకుంట ఎస్సీ శ్మశానవాటిక ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఎస్సీ కాలనీవాసులతో నేరుగా ఫోన్లో మాట్లాడిన బాలయ్య
పాదయాత్ర ద్వారా వెలుగులోకి వచ్చిన సమస్య
మూడు రోజుల్లో వ్యక్తిగతంగా సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ
ఆందోళన చెందొద్దు అంటూ భరోసా pic.twitter.com/oiSwTcAnRl
— BIG TV Breaking News (@bigtvtelugu) December 20, 2025
బాలకృష్ణ ఇచ్చిన హామీతో కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఆయన జోక్యం సమస్యకు పరిష్కారం చూపుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల్లో బాలయ్య తన మాట నిలబెట్టుకుంటారా అని వేచి చూడాలి.


