|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

30 ఏళ్లు ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో కోట శ్రీనివాసరావు భార్య.. ఏం జరిగిందో తెలుసా? కోట ఫ్యామిలీ డిటెయిల్స్

Published: 19-08-2025, 2:06 PM
30 ఏళ్లు ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో కోట శ్రీనివాసరావు భార్య.. ఏం జరిగిందో తెలుసా? కోట ఫ్యామిలీ డిటెయిల్స్

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి మరణించారు. 30 ఏళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె జీవితం, కోట కుటుంబ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Key Points

1

కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి కన్నుమూశారు.

2

రుక్మిణి 30 ఏళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు.

4

కోట కుటుంబ సభ్యుల జీవితంలోని విషాద సంఘటనలు.

రుక్మిణి మరణంతో కోట కుటుంబంలో విషాదం

కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణీ సోమవారం ఉదయం కన్నుమూశారు. నెల రోజుల క్రితమే కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. నెల రోజుల గ్యాప్‌లోనే వారి కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. కోట శ్రీనివాసరావు గత ఇంటర్వ్యూలో తన భార్యకి ఉన్న సమస్యని బయటపెట్టారు. ఆమె సైకియాట్రిక్‌ పేషెంట్‌ అని తెలిపారు. ముప్పై ఏళ్లపాటు తాను చిన్నపిల్లలా కాపాడుకున్నట్టు తెలిపారు కోట.

కోట శ్రీనివాసరావుకి రుక్మిణీతో 1968లో మ్యారేజ్‌ అయ్యింది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుకు ప్రసాద్‌ సినిమాల్లో నటించారు. 2010లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన `సిద్ధం`, `గాయం 2` వంటి చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలో అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు కోట శ్రీనివాసరావు. తన తండ్రి పేరునే పెద్దకొడుక్కి పెట్టాడు ప్రసాద్‌. చిన్న కొడుకు శ్రీహర్ష. ఇద్దరు బిటెక్‌ చేశారు. ఇప్పుడు ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నారు. వాళ్లకి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదని తెలిపారు కోట.

30 ఏళ్ల పాటు మానసిక అనారోగ్యంతో బాధ

కొడుకు మరణంతో మనవళ్ల బాధ్యతని కోడలు చూసుకుందని, తాను చెప్పడంతో జాబ్‌ మానేసి పిల్లల్ని బాగా తీర్చిదిద్దిందని , ఇప్పుడు వాళ్లు ప్రయోజకులు అయ్యారని తెలిపారు కోట. తను వెల్‌ ఎడ్యూకేటెడ్‌ అని, కానీ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చి జాబ్‌ వదిలేసుకుందని, తమని, పిల్లల్ని బాగా చూసుకుంటుందని తెలిపారు కోట.

ఇక చిన్న కూతురు టీనేజ్‌లోనే రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమె కాలు కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో తాను బ్యాంక్‌లో గుమస్తాగా పనిచేసే సార్‌ పెద్దమనసు చేసుకుని తనకు వియ్యంకుడు అయ్యాడని తెలిపారు కోట. ఆమెకి ఒక కూతురు ఉందని, బాగా చదువుతుందని తెలిపారు కోట.

కోట శ్రీనివాసరావు కుటుంబ వివరాలు

ఇక తన భార్య గురించి ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టారు కోట. `1973లో భార్య రుక్మిణీ డెలివరీ సమయంలో మా అత్తగారు చనిపోయింది. ఆ విషయం తెలిసి నా భార్య షాక్‌కి గురయ్యింది. మానసికంగా డిస్టర్బ్ అయ్యింది. సైకియాట్రిక్‌ పేషెంట్‌గా మారిపోయింది. ఎవరినీ గుర్తుపట్టలేకపోయింది. చివరికి నన్ను కూడా. ఇలా ముప్పై ఏళ్లపాటు ఆమెని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియదు. చెప్పాల్సిన అవసరం లేదని ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు తాను బాగానే ఉంది. తన కుటుంబంలో చాలా విషాదం ఉంది. కానీ ఆ విషయాలు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు అని తెలిపారు కోట శ్రీనివాసరావు. గతంలో సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు కోట. ఈ విషయం అందరిని కలిచి వేస్తుంది.

కోట శ్రీనివాసరావు కుటుంబం ఎదుర్కొన్న విషాదాలకు ఈ మరణం మరో చేర్పు. ఆయన భార్య రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.