|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kotha Lokah Chapter 1: కొత్త లోకా వివాదాస్పద సీన్‌.. దుల్కర్ సల్మాన్ సంస్థ క్షమాపణలు!

Published: 02-09-2025, 10:13 AM
Kotha Lokah Chapter 1: కొత్త లోకా వివాదాస్పద సీన్‌.. దుల్కర్ సల్మాన్ సంస్థ క్షమాపణలు!

మలయాళ చిత్రం ‘కొత్త లోకా’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతోంది. కానీ, సినిమాలోని ఒక సన్నివేశం పెద్ద వివాదానికి దారితీసింది. బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని విమర్శలు వ్యక్తమయ్యాయి.

Key Points

1

కొత్త లోకా చిత్రంలోని ఒక సన్నివేశం వివాదానికి దారితీసింది.

2

బెంగళూరు మహిళలను కించపరిచేలా సన్నివేశం ఉందని విమర్శలు.

4

వివాదాస్పద సన్నివేశాన్ని తొలగిస్తామని సంస్థ ప్రకటించింది.

కొత్త లోకా చిత్రం వివాదంలో

మలయాళ చిత్రాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ‌ ఉంటోంది . కంటెంట్ ‌ బాగుంటే మనవాళ్ల థియేటర్లకు ఎగబడుతున్నారు . ఇటీవల రిలీజైన మరో మలయాళ చిత్రం కొత్త లోక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది . ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించింది . ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు . ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు .

బెంగళూరు మహిళలపై విమర్శలు

అయితే ఈ సినిమాలోని ఓ సీన్ ‌ వివాదానికి దారితీసింది . బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందంటూ విమర్శలొచ్చాయి . దీంతో దుల్కర్ సల్మాన్ ‌ కు చెందిన నిర్మాణ సంస్థ వేఫరర్‌ ఫిల్మ్స్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది . మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని ట్వీట్ చేసింది . కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది . ఈ విషయంలో తమను క్షమించాలని కోరుతూ వేఫరర్‌ ఫిల్మ్స్‌ లేఖను పోస్ట్ ‌ చేశారు .

దుల్కర్ సల్మాన్ సంస్థ స్పందన

ఈ సినిమాలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ (కొరియోగ్రాఫర్ శాండీ పోషించిన పాత్ర) బెంగళూరుకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని .. వారు క్యారెక్టర్ ‌ లెస్ ‌ అంటూ మాట్లాడారు . ఈ సీన్ ‌ బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి . కన్నడ డైరెక్టర్ ‌ మన్సూర్ ‌ సైతం ఈ సినిమాపై విమర్శలు చేశారు . కన్నడ భీమ, మలయాళ చిత్రాలు ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఆవేశం, ఇప్పుడు కొత్త లోకా లాంటి సినిమాలతో బెంగళూరును మాదకద్రవ్యాలు , నేరాలకు రాజధానిగా చిత్రీకరించారని అన్నారు . ఒకప్పుడు, సినిమాల్లో అందమైన పట్టణంగా చూపించిన బెంగళూరు .. నియంత్రణ లేని వలసల కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుందని ట్వీట్ ‌ లో రాసుకొచ్చారు .

కొత్త లోకా చిత్రం వివాదాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ సంస్థ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. వివాద సన్నివేశం తొలగింపుతో విమర్శల తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.