
రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రేమకథగా మొదలైన ఈ కథ ఒక షాకింగ్ మలుపు తీసుకుంటుంది. ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 18న విడుదలవుతోంది.
Key Points
రానా దగ్గుబాటి సమర్పణలో వచ్చే కామెడీ ఎంటర్‌టైనర్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'.
ప్రేమకథగా మొదలై షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది.
నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
జులై 18న థియేటర్లలో విడుదల కానుంది.
కొత్తపల్లిలో ఒక ప్రేమకథ
రానా దగ్గుబాటి సమర్పణలో రాబోతున్న మరో కామెడీ ఎంటర్‌టైనింగ్ చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu). ‘C/O కంచరపాలెం, ఉమామేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన రాగా.. తాజాగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఇక ట్రైలర్ (Trailer) విషయానికి వస్తే.. స్థానిక రికార్డ్ డ్యాన్స్ స్టూడియో యజమాని అయిన రామకృష్ణ సావిత్రిని గాఢంగా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ప్రేమిస్తుంది. అయితే.. ఒక రోజు, సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమందని కబురు వస్తుంది. దీంతో రామకృష్ణ చాలా సంతోషంగా, ఆసక్తిగా అక్కిడికి వెళ్తే.. ప్రేమకథగా భావించిన స్టోరీ మొత్తం ఒక్కసారిగా షాకింగ్ మలుపు తిరుగుతుంది. అసలు ఆరోజు కొత్తపల్లిలో ఏం జరిగింది అనేది స్టోరీగా తెలుస్తోంది. కాగా.. మనోజ్ చంద్ర, మోనికా టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, ప్రవీణ పరుచూరి, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ జులై 18న రిలీజ్ కాబోతుంది. Link
షాకింగ్ మలుపు
జులై 18న విడుదల
చివరికి, కొత్తపల్లిలో జరిగిన షాకింగ్ సంఘటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం.


