
📌 Key Points
- కృష్ణంరాజు, అలీ స్మశానంలో అర్ధరాత్రి బిర్యానీ తిన్న సంఘటన వైరల్!
- బిల్లా సినిమా షూటింగ్ సమయంలో మలేషియాలో ఈ ఘటన జరిగింది.
- కృష్ణంరాజు గారి ఫుడ్ పెట్టే అలవాటు గురించి అలీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
- 40 రోజులు మలేషియాలో షూటింగ్, ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు!
టాలీవుడ్ లో కృష్ణంరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మంచితనం, అతిథి మర్యాదలకు ఎంతోమంది ఫిదా అయ్యారు. తాజాగా అలీ గారు కృష్ణంరాజుతో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే…
అలీ చెప్పిన కృష్ణంరాజు గారి ఫుడ్ సీక్రెట్స్
Krishnam Raju : కృష్ణం రాజు, ప్రభాస్.. ఆ కుటుంబం ఫుడ్ ఎంత బాగా పెడతారో అందరికి తెలిసిందే. ఇంటికి వచ్చింది ఎవరైనా ఫుడ్ తో మర్యాదలు చేసి కడుపు నింపి పంపుతారు. కృష్ణం రాజు, ప్రభాస్ ఫుడ్ పెట్టడం గురించి చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే అనేకమార్లు తెలిపారు.(Krishnam Raju)
తాజాగా నటుడు అలీ కృష్ణం రాజు తో జరిగిన ఓ సంఘటన తెలిపారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్ కి కృష్ణం రాజు భార్య శ్యామల హాజరైంది. ఇదే ఈవెంట్ కి అలీ కూడా హాజరవగా కృష్ణంరాజుతో బిల్లా సినిమా షూటింగ్ సమయంలో మలేషియాలో జరిగిన ఓ సంఘటన తెలిపారు.
బిల్లా సినిమా షూటింగ్ లో బిర్యానీ ట్రీట్
అలీ మాట్లాడుతూ.. రాత్రి 3 గంటలకు చిమ్మ చీకటి. స్మశానంలో సీన్ షూటింగ్ జరుగుతుంది. కృష్ణంరాజు గారు నా దగ్గరికి వచ్చి అరె ఆలీ కీమా బిర్యాని తింటావా అని అడిగారు. అర్ధరాత్రి స్మశానంలో బిర్యానీ ఏంటండీ అంటే.. సమాధులను చూపిస్తూ వాళ్లకు అవకాశం లేదురా మనకు ఉంది అన్నారు.
మలేషియాలో 40 రోజుల పాటు స్పెషల్ వంటకాలు
అప్పుడు శ్యామల గారు బిర్యానీ తీసుకొచ్చి పెడితే మేము అర్ధరాత్రి అక్కడ స్మశానంలో బిర్యానీ తిన్నాము. ఆ టైంలో అద్భుతం. దాదాపు 40 రోజులు మలేషియాలో ఉంటే రోజుకొక ఐటెం తెచ్చిపెట్టేవాళ్ళు. ఒకసారి తెచ్చిన ఫుడ్ ఐటెం మళ్ళీ తెచ్చేవాళ్ళు కాదు అని తెలిపారు.
కృష్ణంరాజు, అలీల మధ్య జరిగిన ఈ సంఘటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వారి అనుబంధం గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి.


