|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కృష్ణంరాజుకి ఆ హీరో అంటే పిచ్చి అభిమానం! టీవీకి అతుక్కుపోయేవారట!!

Published: 16-03-2026, 8:05 AM
షాకింగ్: కృష్ణంరాజుకి ఆ హీరో అంటే పిచ్చి అభిమానం! టీవీకి అతుక్కుపోయేవారట!!
  • రెబల్ స్టార్ కృష్ణంరాజుకి దిలీప్ కుమార్ అంటే విపరీతమైన అభిమానం అని స్వయంగా వెల్లడించారు.
  • దిలీప్ కుమార్ సినిమాలు టీవీలో వస్తుంటే ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఆపేసి చూసేవారట కృష్ణంరాజు.
  • కృష్ణంరాజు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమాను హిందీలో దిలీప్ కుమార్‌తో ‘ధర్మ అధికారి’గా రీమేక్ చేశారు.
  • కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘ధర్మ అధికారి’ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, దిలీప్ కుమార్ నటన అద్భుతం.

రెబల్ స్టార్ కృష్ణంరాజు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. అయితే కృష్ణంరాజుకి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయనంటే కృష్ణంరాజుకి ప్రాణం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కృష్ణంరాజుకి దిలీప్ కుమార్‌పై అభిమానం వెనుక కథ

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు టాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయిలో దిగ్గజ నటుడిగా ఎదిగారు. మర్యాదల విషయంలో తనకు తానే సాటి. అది సినిమా సెట్‌ అయినా, ఇళ్లు అయినా టాలీవుడ్‌ లో ఆయనది గొప్ప మనసు. యాక్షన్‌ సినిమాలతో హీరోగా రాణించారు. రెబల్‌ పాత్రల్లో కనిపించి రెబల్‌ స్టార్‌ అనే గుర్తింపు తెచ్చుకున్నారు.

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఎంతో మందికి ఆయన స్ఫూర్తి. ఆయన్ని చూసి సినిమాల్లోకి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి ఆయనకు ఇష్టమైన హీరో ఎవరు? ఆయన్న ఎవరిని ఎవరుగా ఆరాధిస్తారు అనేది చూస్తే, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రెబల్‌ స్టార్‌ స్వయంగా తనకు ఇష్టమైన నటుడు ఎవరో వెల్లడించారు. ఆయన సినిమాలు టీవీలో వస్తున్నాయంటే ఎంత అర్జెంట్‌ పని ఉన్నా, అలానే టీవీకి అతుక్కుపోతారు. సినిమా చూశాకే కదులుతారు. అంతగా ఇష్టపడతారు. కాకపోతే ఆ హీరో మన తెలుగు హీరో కాకపోవడం గమనార్హం.

దిలీప్ కుమార్‌తో కృష్ణంరాజు సినిమా తీశారంటే నమ్ముతారా?

కృష్ణంరాజు అంతగా ఇష్టపడే నటుడు దిలీప్‌ కుమార్‌. ఆయనంటే ఎంతో ఇష్టం. టీవీలో ఆయన సినిమా వస్తుందంటే ఆగిపోయి సినిమా చూస్తానని తెలిపారు రెబల్‌ స్టార్‌. అంతేకాదు ఆయన్ని ఏకంగా తన సినిమాలో తీసుకున్నారు. కృష్ణంరాజు నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో `బొబ్బిలి బ్రహ్మన్న` ఒకటి. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నారు. అందరు ధర్మేంద్రతో చేయాలనుకున్నారు.

ధర్మ అధికారి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణంరాజు

కానీ కృష్ణంరాజుకి మాత్రం దిలీప్‌ తో చేయాలనుకున్నారు. ఆయనకు సినిమా చూపించారు. పాత్ర, నటన నచ్చి ఆయన చేయడానికి ఓకే చెప్పారు. ఇంకా చెప్పాలంటే కృష్ణంరాజు ఒప్పించారు. సినిమా బాగా వచ్చింది. దిలీప్‌ కుమార్‌ ఇరగదీశారు. `ధర్మ అధికారి` పేరుతో రూపొందిన ఈ చిత్రం హిందీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయ్యింది. ఇందులో దిలీప్‌ కుమార్‌, జితేంద్ర, శ్రీదేవి నటించారు. ఈ మూవీని కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కృష్ణంరాజు నిర్మించారు. అలా తనకు ఇష్టమైన నటుడితో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు రెబల్‌ స్టార్‌.

కృష్ణంరాజు తన అభిమాన నటుడు దిలీప్ కుమార్‌తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.