|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కృతి శెట్టికి షాక్: తమిళ్ ఎంట్రీ కూడా ఫ్లాప్! నెక్స్ట్ ఏంటి?

Published: 22-01-2026, 2:05 AM
  • కృతి శెట్టికి వరుసగా ఫ్లాప్స్, టాలీవుడ్ లో ఆఫర్స్ డౌన్!
  • తమిళ్ లో కార్తీతో చేసిన ‘వా.. వాతియార్’ మూవీకి మిక్స్డ్ టాక్!
  • ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో LIK మూవీలో కృతి!
  • చిరంజీవి సినిమాలో కూతురిగా కృతి శెట్టి నటిస్తుందని టాక్!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టికి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది?

వరుస ఫ్లాపులతో కృతి కెరీర్ డౌన్?

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవడం లేదు. తెలుగులో ఉప్పనే, శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు తరువాత ఆమె చాలా సినిమాలు చేసింది. కానీ, ఒక్క హిట్ కూడా అందుకోలేదు. దాంతో, టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ తగ్గుముఖం పట్టాయి. కనీసం ఇండస్ట్రీ మారిస్తే అయినా హిట్ వస్తుందని భావించింది.

అలా మలయాళ ఇండీస్ట్రీలో మొదటి సినిమా చేసింది. అదే ‘ఏఆర్ఏం’. టోవినో థామస్ హీరోగా వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ మంచి విజయాన్ని సాధించింది. అయినా కూడా ఆమెకు మలయాళం నుంచి ఆశించిన గుర్తింపు రాలేదు. ఆఫర్స్ కూడా రాలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆమె తమిళంలో నటించిన లేటెస్ట్ అండ్ ఫస్ట్ మూవీ వా.. వాతియార్. స్టార్ హీరో కార్తీ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అయ్యింది.

తమిళ్ లో మొదటి సినిమాకి షాకింగ్ రిజల్ట్!

అయితే, పలుమార్లు విడుదల వాయిదా వేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆశించిన రిజల్ట్ రాలేదు. కథ, కథనం రొటీన్ గా ఉండటంతో వా.. వాతియార్ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. అలా తమిళంలో మొదటి సినిమా కూడా కృతి శెట్టి(Krithi Shetty)కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలోనే చేస్తున్న మరో సినిమా LIK.

చిరు సినిమాలో కృతికి ఛాన్స్.. హిట్ కొడుతుందా?

లేటెస్ట్ సెన్సేషన ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుందట ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఆమె చిరంజీవి కూతురిగా కనిపిస్తుందని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కృతి శెట్టి భవిష్యత్తు ఏమిటో చూడాలి. ఆమె రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.