
📌 Key Points
- కృతి శెట్టి బ్లాక్ డ్రెస్‌లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైరల్ పోస్ట్
- ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీలో ప్రదీప్ రంగనాథ్‌తో కృతి శెట్టి సందడి
- బ్లాక్ డ్రెస్‌లో బేబమ్మ సంప్రదాయ లుక్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్
- వా వాతియార్ మూవీని థియేటర్లలో కుటుంబంతో చూడాలని కృతి పిలుపు
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి మరోసారి తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో సంప్రదాయంగా కనిపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ డ్రెస్‌లో కృతి శెట్టి సంప్రదాయ లుక్
‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్నది ఈ చిన్నది.
ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్సుకు చున్నీకప్పుకొని చాలా సంప్రదాయకంగా కనిపించింది. మినిమల్ మేకప్‌తో చాలా అందంగా ఉంది. ఇక హెయిర్ లీవ్ చేసుకుని కొన్ని డిఫరెంట్ స్టిల్స్‌తో పిక్స్ దిగింది.
నెటిజన్ల కామెంట్స్.. ఎలా ఇంత అందంగా ఉన్నావ్?
ఇక వాటికి.. ‘సంక్రాంతి శుభాకాంక్షలు.. పొంగలో పొంగల్ ఈ సమయం మరింత ప్రత్యేకమైనది ఎందుకంటే వా వాతియార్ మూవీ మీ దగ్గర్లోని థియేటర్లలో ఉంది.. దయచేసి మీ కుటుంబంతో వెళ్లి ఆనందించండి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఎలా ఇంత అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో కృతి బిజీ
A post shared by Krithi Shetty (@krithi.shetty_official)
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


