
📌 Key Points
- బేబమ్మ లేటెస్ట్ పోస్ట్ వైరల్: కృతి శెట్టి అందమైన ఫోటోలు, అదిరిపోయే కామెంట్లతో రచ్చ!
- ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ రియాక్షన్: కృతి శెట్టి పోస్ట్ పై సూపర్ కామెంట్స్!
- కార్తీతో కృతి శెట్టి మూవీ: ‘అన్నగారు వస్తారు’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, కృతి ఫ్యాన్స్ ఖుషీ!
- సోషల్ మీడియాలో కృతి శెట్టి ట్రెండింగ్: స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులు!
యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి మరోసారి సోషల్ మీడియాలో తన క్రేజ్ చూపిస్తోంది. లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను ఫిదా చేస్తూ, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
కృతి శెట్టి లేటెస్ట్ పోస్ట్ వైరల్
‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.
ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్న ఈ చిన్నది.. రీసెంట్‌గా స్టార్ హీరో కార్తి(Karthi) నటించిన ‘అన్నగారు వస్తారు’(annagaru Vastharu) మూవీతో మన ముందుకు వచ్చింది. నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది.
మాళవిక మోహనన్ సూపర్ కామెంట్
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా(Instagram) అకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో బొట్టు పెట్టుకుంటున్న, కళ్లకు కాటుక పెట్టుకుంటున్న ఫొటోలతో పాటు వయ్యారంగా ఓ పార్కులో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు జోడించింది. ఇక దీనికి.. ‘కఠినమైన ప్రపంచంలో మృదువుగా ఉండగల సామర్థ్యం అత్యంత అందమైన బలాల్లో ఒకటి.. ఫెమినైన్ ప్రేమ.. P.S. ఈ పాట నాకు చాలా ఇష్టం’ అంటూ స్నేహితుడా స్నేహితుడా చిన్ననాటి స్నేహితుడా అనే తమిళ్ వర్షన్ సాంగ్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ ముద్దుగుమ్మ పోస్టుపై హీరోయిన్ మాళవిక మోహనన్ ‘క్యాప్షన్ సూపర్’ అంటూ కామెంట్ చేసింది.
సోషల్ మీడియాలో బేబమ్మ ట్రెండింగ్
A post shared by Krithi Shetty (@krithi.shetty_official)
కృతి శెట్టి పోస్ట్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఆమె తదుపరి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని సినిమా వార్తల కోసం చూస్తూనే ఉండండి!


