|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేటీఆర్ సంచలనం! ‘జైబోలో తెలంగాణ’ డైరెక్టర్‌కు కేటీఆర్ పరామర్శ!

Published: 02-02-2026, 8:35 AM
కేటీఆర్ సంచలనం! 'జైబోలో తెలంగాణ' డైరెక్టర్‌కు కేటీఆర్ పరామర్శ!
  • డైరెక్టర్ ఎన్‌. శంకర్‌ను పరామర్శించిన కేటీఆర్!
  • మాడ్గులపల్లి మండలం చిరుమర్తికి చెందిన శంకర్
  • 1997లో ‘ఎన్‌కౌంటర్‌’తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం
  • జైబోలో తెలంగాణ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు

టాలీవుడ్ నుండి ఒక షాకింగ్ న్యూస్! కేటీఆర్ గారు ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్‌ను కలిశారు. దీని వెనుక అసలు కారణం ఏమిటి? పూర్తి వివరాల కోసం కిందికి స్క్రోల్ చేయండి!

శోకసంద్రంలో ఎన్. శంకర్

జైబోలో తెలంగాణ చిత్ర(Jaibolo Telangana Movie) దర్శకులు ఎన్‌. శంకర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కలిశారు. శంకర్ తల్లి నిమ్మల సక్కుబాయమ్మ గతవారం కన్నుమూశారు. ఇవాళ శంకర్‌ను కలిసి కేటీఆర్ ధైర్యం చెప్పారు. కాగా, నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి గ్రామానికి చెందిన శంకర్(N. Shankar).. 1997లో ‘ఎన్‌కౌంటర్‌’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జైబోలో తెలంగాణ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన జైబోలో తెలంగాణ సినిమా.. అప్పటి తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి. ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నిమ్మల శంకర్‌కు అవార్డు వచ్చిది. ఉత్తమ గాయకుడిగా గద్దర్‌కు అవార్డు లభించింది. ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి. ఇరానీ, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చక్రీ సంగీతం అందించారు.

కేటీఆర్ పరామర్శ, ధైర్యం

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శంకర్

కేటీఆర్ గారు ఎన్. శంకర్‌ను పరామర్శించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి సంఘటనల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.